Keerthy Suresh: "హీరోయిన్లది గ్యారెంటీ లేని జీవితం" అంటోంది మహానటి..కీర్తి సురేష్. వరుసగా సౌత్‌లోని అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ..ఈ మధ్య బాలీవుడ్ నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న కీర్తి, ఉన్నపలంగా ఇలా ఎందుకు అన్నది..అనే ఆశ్చర్యం అందరిలోనూ కలుగుతోంది. కీర్తి సురేష్ ఇలా అనడానికి ముఖ్య కారణం కూడా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆమె నటించిన మహానటి సినిమా. ఈ సినిమా తర్వాతే 6 నెలలపాటు కొత్త ప్రాజెక్ట్ ఏదీ రాలేదని ఫీలై అలా అన్నది.
సినీ నేపథ్యం నుంచి వచ్చిన కీర్తి సురేష్‌కి సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. తమిళంలో శివ కార్తికేయన్..విజయ్..సూర్య లాంటి స్టార్ హీరోలతో నటించి కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్గా మారింది. ఆ క్రేజ్‌తో, తెలుగులో నేను శైలజ, నేను లోకల్ లాంటి సూపర్ హిట్ సినిమాలలోనూ నటించింది. ఇక్కడ, పవన్ కళ్యాణ్‌తో చేసిన అజ్ఞాతవాసి డిజాస్టర్. అప్పుడు, కూడా కీర్తికి బాధ కలగలేదు. కానీ, ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ దక్కించుకున్న మహానటి సినిమా మాత్రం ఆమెకి బాధనే మిగిల్చింది.
సావిత్రి బయోపిక్‌తో కీర్తికి అసాధారణమైన క్రేజ్:
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందించిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ తనేంటో నిరూపించుకుంది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డ్ కూడా అందుకుంది. కానీ, మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాత్రం 6 నెలలపాటు కొత్త సినిమాకి సైన్ చేయకుండా ఖాళీగా ఉందట. దీంతో, హీరోలకి ఓ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే ఛాన్సులొస్తాయి గానీ, హీరోయిన్స్‌కి మాత్రం అలా జరగని తెలుసుకుంది. ఈ 6 నెలల్లో డబ్బును ఎలా జాగ్రత్తపరుచుకోవాలో నేర్చుకుందట.
అంతేకాదు, ఎన్ని బ్లాక్ బస్టర్స్ అందుకున్నా హీరోయిన్లది గ్యారెంటీ లేని జీవితం అన్న విషయాన్ని గ్రహించందని తాజాగా జరిగిన అక్క ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చింది. కాగా, కీర్తి ఖాతాలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఏడాదిలో రెండు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే, 2027 ప్రారంభంలోనే వెంకటేష్ సరసన నటిస్తున్న జనవరి 12 విడుదల మూవీతో మన ముందుకు రాబోతోంది.


