తెలంగాణ

ప్రజాభవన్ ఎదుట మోకాళ్లపై కూర్చుని మాజీ సర్పంచుల నిరసన

రచన: NK•••4 నిమిషాల పఠనం

Protest: తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆందోళన బాటపట్టింది. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచులు నిరసనకు దిగారు. మోకాళ్ళపై కూర్చుని తమ నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Protest: తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆందోళన బాటపట్టింది. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచులు నిరసనకు దిగారు. మోకాళ్ళపై కూర్చుని నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మూడేళ్లుగా బిల్లులు పెండింగ్

గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేసిన మాజీ సర్పంచులకు ఇప్పటికీ బిల్లులు అందలేదని, దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటివరకు ప్రజాభవన్ లో 13 సార్లు వినతి పత్రాలు అందజేశామన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.

మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారని ప్రభుత్వంపై మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనైనా ప్రభుత్వం స్పందించాలని, బిల్లులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయవద్దంటూ పట్టభద్రులను కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం

''ఊర్ల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. లేకపోతే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయొద్దని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. ఆ పరిస్థితి రావద్దంటే ఎన్నికల కోడ్ వచ్చేలోపు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి న్యాయం చేయాలి'' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జేఏసీ.

#Protest#Ex Sarpanches#Hyderabad#Prajabhavan#Pending Bills#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి