సినిమా

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ కథ మార్చారు కాబట్టే డిజాస్టర్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Karthik Subbaraj: కొన్ని సినిమాలు రిలీజ్ సమయంలో కాకుండా, ఆ తర్వాత ఎప్పటికో గానీ, అసలు బాక్సాఫీస్ లెక్కలు..ఫ్లాప్ కి కారణాలు..కారణమైన వ్యక్తులు బయటకు వస్తారు. తాజాగా, తమిళ దర్శకరచయిత కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించిన ఓ ఆసక్తికరమైన విషయం మెగా అభిమానులను షాక్‌కి గురి చేస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సంబందించి కార్తీక్ ఇచ్చిన కథను దర్శకుడు శంకర్ మార్చడం వల్లే డిజాస్టర్ అయిందని అసలు విషయాన్ని బయటపెట్టాడు.

‘గేమ్ ఛేంజర్’ శంకర్ సినిమా కాదన్నారు:

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ‘గేమ్ ఛేంజర్’ రావడంతో అందరిలోనూ అంతే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పైగా, శంకర్ తో చరణ్-దిల్ రాజు ప్రాజెక్ట్ అనగానే కూడా అంచనాలు, ఆసక్తి రెట్టింపయ్యాయి. కానీ, సినిమా రిలీజైయ్యాక దీనికి దర్శకుడు శంకరేనా అని సందేహించారు.

కార్తీక్ సుబ్బరాజ్ కథ మార్చిన శంకర్:

‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా లెవల్‌లో హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, శంకర్ చేసిన తప్పిదం వల్ల నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలు, చరణ్ కెరీర్‌లో ఓ డిజాస్టర్ చేరాయి. ఏవో కొన్ని సీన్స్ కోసమే సినిమా తీసినట్టుగా అర్థం అవుతుంది. మ్యూజికల్‌గా కూడా ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అనే చెప్పాలి. ఏ ఒక్క పాట ఎవరికీ గుర్తుండని దారుణమైన పాటలనిచ్చాడు థమన్.

కార్తీక్ ఇచ్చిన కథలో ఐఏఎస్, ఐపీఎస్ పాత్రలు కాకుండా అంతర్లీనంగా గ్యాంగ్‌స్టర్ కథాంశం ఉంటుందట. అదే, ఒరిజినల్ కథ. ఆ కథనే ఇచ్చాడు కార్తీక్ సుబ్బరాజ్. కానీ, శంకర్ మాత్రం దాన్ని మార్చేసి తమిళ నేటివిటీకి తగ్గట్టుగా అసలు ఏమాత్రం సోల్ లేని సినిమాను తీసి ప్రేక్షకుల ముందు పెట్టాడు. ఈ విషయం ఇన్నాళ్ళు దాచిన కార్తీక్ మాటల సందర్భంలో ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్‌కి అసలు కారణాన్ని బయటపెట్టాడు. ఇది, తెలినప్పటి నుంచి మెగా అభిమానులు శంకర్ మీద మండిపడుతున్నారు. కాగా, ఈ మధ్య మెగాస్టార్‌తో కార్తీక్ సుబ్బరాజ్ రెండు గంటలపాటు గడిపి కథను నరేట్ చేశాడు. ఫైనల్ డెసిషన్ ఇంకా చిరు చెప్పలేదు.

#Karthik Subbaraj#Shankar#Ram Charan#Dil Raju#Game Changer
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి