Tollywood: ముగ్గురు బిగ్ స్టార్ కలిసి ఒకేసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్రకి సిద్ధమవుతున్నారు. ఇది, ఒకరకంగా ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించేదే అయినా, ఆ సినిమాలలో ఏ ఒక్కటైనా ఫలితం తేడా కొడితే..నిర్మాత మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. చిన్న సినిమా అయినా బిగ్ స్టార్ సినిమా అయినా..ఒక్కో వారం ఒక్కో సినిమా రిలీజైతేనే అందరికీ లాభం. అలా, కాకుండా ఒకేరోజు ముగ్గురు పెద్ద స్టార్స్ సినిమాలొస్తే మాత్రం ఎవరో ఒకరు ఎదురుదెబ్బ తినకతప్పదు. అందుకే, బాలయ్య..నాగార్జున..షారుఖ్‌లలో ఎవరు నిలబడతారో అన్నది ఇప్పుడు చర్చ.
బాలయ్య "దాదా":
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమా దాదా. వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్యకి సాలీడ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని మరోసారి బాలయ్యతో దాదా చిత్రాన్ని రూపొందిస్తుండటంతో బాలయ్య అభిమానుల్లోనే కాకుండా, సినీ వర్గాలలోనూ భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే, వాస్తవానికి ఈ సినిమా దసరా బరిలో దింపాలనుకున్నారు. కానీ, బాలయ్యకి గాయం కారణంగా షూటింగ్ ఆలస్యం అయి..ఇప్పుడు డిసెంబర్ 24న డేట్ లాక్ చేశారు.
'కింగ్ 100' కూడా 'దాదా'తోనే రాక:
కింగ్ నాగార్జున సోలో హీరోగా నటించిన సినిమా వచ్చి చాలాకాలం అయింది. 'కుబేర'లో ధనుష్‌తో కలిసి నటించాడు. 'కూలీ'లో రజినీకాంత్‌తో కలిసి నటించాడు. అయితే, ఈ పాత్రల వల్ల నాగార్జునకి కలిసొచ్చిందేమీ లేదు. అందుకే, ఆయన కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ 100 చేస్తున్నాడు. తమిళ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. ఇంకా, ఈ సినిమాకి టైటిల్ పెట్టలేదు. అయితే, బాలయ్య దాదాతో పాటే కింగ్ 100 కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
బాలయ్య-నాగ్‌లపై షారుఖ్ ప్రభావం!
బాలయ్య నటిస్తున్న దాదా, నాగార్జున నటిస్తున్న కింగ్ 100 సినిమాలపై బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమా ప్రభావం ఉంటుందా ఉండదా..అనేది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అయితే, అలా ఒకప్పుడు మన తెలుగు సినిమాలపై హిందీ సినిమాల ప్రభావం ఉండేది. కానీ, ఇప్పుడు తగ్గింది. గత కొన్నేళ్ళుగా సౌత్‌లో హిందీ సినిమాల ప్రభావం తగ్గిందనే చెప్పాలి. కానీ, మన సినిమాలు మాత్రం నార్త్ బెల్ట్‌లో..సౌత్ భాషలలో బాగానే ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి, డిసెంబర్ 24న వస్తున్న ఈ ముగ్గురు హీరోలలో ఎక్కువగా ఠఫ్ ఫైట్ ఉండే బాలయ్య-నాగార్జునల మధ్యనే అనుకోవాలి.


