తెలంగాణ

Telangana: కీలక శాఖలపై రేవంత్ సర్కార్ ఫోకస్-12 మంది ఐఏఎస్‌ అధికారులకు కొత్త బాధ్యతలు!

రచన: Venu•••5 నిమిషాల పఠనం

ఏప్రిల్‌లో సైతం కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ల స్థాయిలో మార్పులు జరిగాయి. జూన్‌లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు వివిధ శాఖల్లో 13 మంది అధికారులకు కొత్త పోస్టింగులు, అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.. మరోవైపు ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో మరోసారి కీలక మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. సీనియర్ ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించడం, కొన్ని శాఖలకు అదనపు అధికారులను నియమించడం ద్వారా పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్టు అధికార వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగా మొత్తం 12 మంది అధికారులకు సంబంధించి బదిలీలు, అదనపు బాధ్యతలపై తాజాగా ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం.

ఈ జాబితాలో పర్యావరణం, అటవీ, ఇంధనం, పంచాయతీరాజ్, క్రీడలు, దేవాదాయ, గిరిజన సంక్షేమం, రవాణా, వైద్యారోగ్యం వంటి కీలక శాఖలకు సంబంధించిన మార్పులు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అధికార వర్గాల సమాచారం ప్రకారం.. వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ, వాణీ ప్రసాద్‌కు క్రీడల శాఖ, నవీన్ మిట్టల్‌కు పంచాయతీరాజ్ శాఖ, శైలజా రామయ్యర్‌కు దేవాదాయ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది.

అదేవిధంగా రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు అదనంగా అప్పగించినట్లు సమాచారం.. మరోవైపు కె. ఇలంబర్తికి రవాణా, రోడ్లు భవనాల శాఖ బాధ్యతలు, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించిన అదనపు బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం. ఇక మహిళా సంక్షేమం-ఎస్సీ శాఖలో బాధ్యతలు శృతి ఓజాకు అప్పగించినట్లు జాబితాలో ఉంది.

అదేవిధంగా ముషారఫ్ అలీకి వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బాధ్యతలు, ఎస్. సంగీత సత్యనారాయణకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ బాధ్యతలు, జితేశ్ పాటిల్‌కు టీజీ రెడ్కో వైస్ చైర్మన్ బాధ్యతలు అదనంగా అప్పగించినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో గత కొన్ని నెలలుగా ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. 2026 ఫిబ్రవరిలో సుమారు 45 మంది అధికారులను మార్చుతూ పెద్ద ఎత్తున రేవంత్ ప్రభుత్వం బదిలీలు చేపట్టింది.

అదీగాక ఏప్రిల్‌లో సైతం కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ల స్థాయిలో మార్పులు జరిగాయి. జూన్‌లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు వివిధ శాఖల్లో 13 మంది అధికారులకు కొత్త పోస్టింగులు, అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.. మరోవైపు ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఈ వరుస మార్పుల్లో పరిపాలనా సమన్వయం, శాఖల్లో ఖాళీల భర్తీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలు ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి.

ఇక రాష్ట్రంలోని కీలక శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే ఒకే శాఖలో సుదీర్ఘంగా పని చేయడం వల్ల అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై చర్చలు మొదలైనట్టు సమాచారం..

#Telangana IAS Transfers#Telangana Government News#IAS Officers Reshuffle#Telangana Bureaucracy#Telangana Latest News#IAS Posting Updates#Telangana Administrative Changes#Government Officers Transfers#Telangana Political News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి