తెలంగాణ

TG : తెలంగాణలో 365 కరువు మండలాలు.. సర్కార్ కీలక నిర్ణయం!

రచన: Kumar••5 నిమిషాల పఠనం

ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో సాగు, తాగు నీటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో సాగు, తాగు నీటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సాగు, తాగు నీటి ఇబ్బందులు ఏర్పడిన చోట కరువును డిక్లేర్ చేసింది. దీంతో కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరి కరువు ప్రాంతాల్లో అన్నదాతలకు ఆర్థిక సాయం ప్రకటించేందుకు సిద్ధమైంది.

నైరుతి జాడ కరువు..

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు త్వరగా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో ప్రతిఏటా కురవాల్సిన వర్షపాతం కంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు కూడా వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఈ ఏడాది సాగుకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది.తాగునీటికే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. వచ్చే యాసంగి సీజన్‌లో వరి పంట వేయొద్దని, క్రాప్ హాలిడే ప్రకటించాలని రైతులను కోరింది.

తీవ్ర పంట నష్టం..

వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రతి ఏటా సాధారణంగా 740.6 మి.మీ వర్షం పడాల్సి ఉండగా, ఈసారి కేవలం 615.5 మి.మీ మాత్రమే కురిసింది. అనగా -17% లోటు నమోదైంది. అనగా 33 జిల్లాల్లో 18 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఫలితంగా రైతులు 139.28 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా, కేవలం 126.06 లక్షల ఎకరాల్లోనే వేశారు. వరి సాగు 18% తగ్గిపోయింది. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్ల సామర్థ్యం 585 టీఎంసీలు ఉంటే, ప్రస్తుతం కేవలం 179.63 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

కరువు డిక్లేర్ చేసిన సర్కార్..

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించింది. 111 మండలాల్లో తీవ్ర కరువు, 254 మండలాల్లో మధ్యస్థ కరువును ప్రకటించింది. ఈ మేరకు నిన్న తెలంగాణ ప్రభుత్వం అధికారిక కరువు మండలాలను ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.

రైతులు, వ్యయసాయ కూలీలకు సాయం..

కరువు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరనుంది. దానిని కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయకూలీలకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలోకి (DBT) చేరనుంది. అంతేకాకుండా తాగునీరు, పశుగ్రాసం, పశువుల శిబిరాల ఏర్పాటు చేయనున్నారు. ఉపాధి హామీ పథకంలో అదనపు పని దినాలను చేర్చనున్నారు. వ్యవసాయ రుణాల పునర్ వ్యవస్థీకరణ, రుణ వసూళ్లను సైతం నిలిపివేసి రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి NDRF సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం.

#drought mandals#Telangana#no rains#elnino#congress government
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి