తెలంగాణ

TRESA: పెండింగ్ బిల్లులు చెల్లించండి- ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ట్రెసా అభ్యర్థన

రచన: NK•••4 నిమిషాల పఠనం

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA-ట్రెసా) రాష్ట్ర ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాని కలిసింది. రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని కోరింది.

TRESA: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA-ట్రెసా) రాష్ట్ర ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాని కలిసింది. రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని కోరింది.

గత ఆర్థిక సంవత్సరం 2025-26, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 కాలానికి వాహన అద్దె చార్జీలు చెల్లించకపోవడం వల్ల తహసీల్దార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రెసా ప్రతినిధులు వాపోయారు. పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్ల వాహన అద్దె చార్జీలను వెంటనే విడుదల చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రతి నెల వాహన అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కు విజ్ఞప్తి చేశారు.

గౌరవ వేతన బిల్లులు క్లియర్ చేయండి

అదే విధంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన గౌరవ వేతన బిల్లులు సైతం పెండింగ్‌లో ఉన్నందున, వాటిని కూడా వెంటనే క్లియర్ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై ప్రిన్సిపల్ సెక్రటరీ సానుకూలంగా స్పందించారని.. పెండింగ్ బిల్లులకు సంబంధించిన వివరాలను టోకెన్ నెంబర్లతో సహా సమర్పించాలని సూచించారని TRESA రాష్ట్ర ప్రతినిధి బృందం తెలిపింది. వివరాలు అందిన వెంటనే పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని వెల్లడించింది.

బిల్లుల టోకెన్ నంబర్ల వివరాలు అందజేయాలి

కాబట్టి రాష్ట్రంలోని సంబంధిత తహసీల్దార్లు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు తమకు సంబంధించిన పెండింగ్ బిల్లుల టోకెన్ నంబర్ల వివరాలను కేటాయించిన స్ప్రెడ్‌షీట్‌లో నమోదు చేసి, బుధవారం ఉదయం లోగా తప్పనిసరిగా అందజేయాలని TRESA రాష్ట్ర ప్రతినిధి బృందం సభ్యులు తెలియజేశారు. వివరాలను సకాలంలో సమర్పించడం ద్వారా పెండింగ్ బిల్లుల పరిష్కారానికి వీలవుతుందన్నారు.

TRESA రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమన్ రెడ్డి, రాష్ట్ర సమన్వయకర్త నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ విక్రమ్ తదితరులు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ ను కలిశారు.

#TRESA#Pending Bills#Revenu Employs#State Finance Principal Secretary#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి