తెలంగాణ

అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన సమస్యలపై మాట్లాడొద్దా? తప్పుని తప్పని చెప్పొద్దా?- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రచన: NK•••3 నిమిషాల పఠనం

కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నేను చచ్చిపోతేనే నా నియోజకవర్గానికి నిధులు ఇస్తారా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Anirudh Reddy: కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నేను చస్తేనే నా నియోజకవర్గానికి నిధులు ఇస్తామంటే.. ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీలో అలజడి సృష్టించాయి.

మూడోసారి తిరగబడతా..

తాజాగా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లో రేషన్ డీలర్ల సమావేశంలో మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. నేను ఒక్కసారి అడుగుతా, రెండోసారి బతిమాలుతా, మూడోసారి తిరగబడతా.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన సమస్యలపై మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు. తప్పుని తప్పు అని చెప్పొద్దా? అని నిలదీశారు.

ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

తన ప్రసంగంలో ప్రధానంగా రాజకీయ నాయకుల బాధ్యత, డీలర్ల సమస్యలు, వారికి గౌరవ వేతనం, కమీషన్ అంశాలపై అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. తన కుటుంబానికి సంబంధించిన దేవుని భూమి విషయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తావించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే 2007లో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ పదేపదే తిప్పించుకోకుండా, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, కమీషన్‌ కోసం పోరాడతా

ప్రస్తుత జనరేషన్ త్వరితగతిన పనులు పూర్తవ్వాలని కోరుకుంటున్నారని, అందుకు అనుగుణంగా నాయకులు స్పందించాలని అనిరుధ్ రెడ్డి చెప్పారు. రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, కమీషన్‌కు సంబంధించిన సమస్యలపై పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి డీలర్లకు మద్దతుగా నిలుస్తానని తెలిపారు.

#Anirudh Reddy#Jadcherla#Telangana Congress#Ration Dealers#Gajwel#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి