Shruti Haasan: విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు సౌత్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌కి ఈ మధ్య ఆకట్టుకునే కథలు చెప్పే వాళ్ళు లేరని తెలుస్తోంది. అందుకే, కొత్త ప్రాజెక్ట్స్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. గత చిత్రం రజినీకాంత్ నటించిన కూలీ. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు, పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న "ఆకాశంలో ఒక తార" అనే సినిమా రూపొందుతుండగా, ఇందులో కీలక పాత్రను పోషించింది.
'డెకాయిట్' వదులుకోవడం మంచిదే:
ఇటీవల అడవి శేష్ హీరోగా 'డెకాయిట్' అనే సినిమా వచ్చింది. హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది. కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, ముందు ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతి హాసన్ ఎంపికైంది. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ, 'కూలీ' సినిమాకి డేట్స్ క్లాష్ రావడంతో డెకాయిట్ వదులుకుంది. ఈ సినిమా సక్సెస్ కాలేదు కాబట్టి వదులుకుందే మంచిదని ఆ తర్వాత శ్రుతి ఫీలైందట.
ప్రభాస్ 'సలార్ 2' కోసం వేయిటింగ్:
ప్రశాంత్ నీల్, ప్రభాష్ కాంబినేషన్లో రూపొందిన 'సలార్ 1' మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. దీని, తర్వాత కూడా 'సలార్ పార్ట్ 2'లో శ్రుతి నటించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్‌టిర్ హీరోగా 'డ్రాగన్' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా 2027 మార్చి నాటికి దాదాపు పూర్తవుతుంది. ఆ తర్వాత 'సలార్ 2' పనులు మొదలవుతాయి. ఇటీవల, ప్రభాస్ పుట్టినరోజుకి స్వయంగా, ప్రభాస్ ఈ విషయాన్ని బయటపెట్టించాడు. కాబట్టి, 2027 సెకండ్ ఆఫ్‌లో 'సలార్ 2'తో మళ్ళీ మన ముందుకు రావచ్చు.
అయితే, ఇటు తెలుగులో గానీ, అటు తమిళంలో గానీ, శ్రుతి హాసన్‌కి దర్శకులెవరూ మంచి కథను చెప్పలేకపోతున్నారట. అందుకే, ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ప్రకటించడం లేదు. కథ, అందులో పాత్ర నచ్చితే కీలక పాత్రను పోషించడానికైనా సిద్ధంగా ఉంది. ఇటీవల, ఆమె దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించింది. ఈ పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసింది శ్రుతి. కాబట్టి, మేకర్స్ ఎవరైనా ఆమెకి బలమైన పాత్రను చెప్తే గ్యారెంటీగా చేయడానికి రెడీగా ఉంది.


