NBK 112: మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రచయిత కొరటల శివ. మొదటి సినిమాను ఏకంగా ప్రభాస్‌తో చేసి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్‌టిర్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌లను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. అయితే, వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందుకున్న కొరటాల ఆచార్య విషయంలో మాత్రం తడబడ్డాడు. దీని, తర్వాత చేసిన దేవర సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
ప్రస్తుతం, కొరటాల శివ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేయబోతున్నాడు. బాలయ్య నటిస్తున్న దాదా చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 24న భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నెక్స్ట్ సినిమాకి కూడా బాలయ్య బల్క్‌గా డేట్స్ ఇచ్చాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం మొదటిసారి బాలయ్య సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్ కుమార్‌ను కొరటాల ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.
కొరటాల షాకింగ్ డెసిషన్‌కి కారణాలేంటి?
కొరటాల శివ మొదటి సినిమా నుంచి వరుసగా దేవిశ్రీప్రసాద్‌కి సంగీతమందించే బాధ్యతను అప్పగించారు. వీరి కాంబోలో 4 సినిమాలు వచ్చి మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆచార్య సినిమాకి మణిశర్మ, దేవర సినిమాకు అనిరుధ్‌లను తీసుకున్నాడు. కానీ, దేవీ ఇచ్చినంతగా వీరిద్దరు సాంగ్స్ ఇవ్వలేకపోయారు. ఇక, ఇప్పుడు చేయబోతున్న బాలయ్య సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్టుగా సమాచారం.
దేవర సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్‌ను కొరటాల ముందు అనుకున్నప్పటికీ, ఆయన పెళ్ళి, వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటవడంతో రెండేళ్ళ వరకూ ఖాళీ లేదట. ఇక, అఖండ నుంచి ఇప్పుడు చేస్తున్న దాదా చిత్రం వరకూ వరుసగా బాలయ్యకి థమన్ బాదుతూ వచ్చాడు. ఇది, మరీ రొటీన్ కాంబినేషన్ అయిందని కొరటాల కొత్త సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకోవాలని ఫికైయ్యాడట. అందుకే, జీవీ.ప్రకాశ్ కుమార్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి, అధికారికంగా ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.


