స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

TG : అవినీతి ఖాకీలు!

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

పోలీసుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు చూస్తే ఎవరైనా ఈ మాట అనకుండా ఉండరు.విధుల్లో నిజాయితీగా పని చేస్తానని ప్రమాణం చేసి ఖాకీ డ్రెస్ వేసుకునే పోలీసులు ఆ శాఖకే మాయని మచ్చ తెస్తున్నారు. విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు చేస్తున్న ఈ తప్పు వల్ల డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.

-ఏసీబీకి వరుసగా పట్టుబడుతున్న పోలీసులు

- మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు

- రూ.3 లక్షలు ‌లంచం తీసుకుంటూ దొరికిన సీఐ

- ఇన్ స్పెక్టర్ కొండలరావుతో పాటు కానిస్టేబుల్‌ను కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు

- ఏసీబీపైనే భారం వేస్తున్న రేవంత్ ప్రభుత్వం

- ఇప్పటికే వందల్లో కేసులు

- కేవలం 22 మందిపై మాత్రమే ఆదేశాలు

- తెర వెనుక అవినీతిని పోత్సహిస్తున్నారా?

- పోలీసుల బరితెగింపు ధైర్యానికి కారకులు ఎవరు?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

-స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

పోలీసుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు చూస్తే ఎవరైనా ఈ మాట అనకుండా ఉండరు. విధుల్లో నిజాయితీగా పని చేస్తానని ప్రమాణం చేసి ఖాకీ డ్రెస్ వేసుకునే పోలీసులు ఆ శాఖకే మాయని మచ్చ తెస్తున్నారు. విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు చేస్తున్న ఈ తప్పు వల్ల డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.

మంగళవారం హైదరాబాద్‌లోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.3 లక్షల లంచం తీసుకుంటూ సీఐ కొండల్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆయనతో పాటు ఓ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో పోలీస్ స్టేషన్‌లో దాడులు నిర్వహించిన అధికారులు సీఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, ఏ పనికి సంబంధించి లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయంలో కానిస్టేబుల్ పాత్ర ఏంటి వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ నిర్లక్ష్యమే పోలీసుల్లో అవినీతికి పెరుగుదలకు కారణమా?

పోలీస్ శాఖలో అవినీతికి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణంగా కనిపిస్తోంది. ఏసీబీపైనే భారం వేస్తున్న సర్కార్ చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తోంది. ఇప్పటికే వందల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కేవలం 22 మందిపై మాత్రమే ఆదేశాలు వెళ్లాయి. తెర వెనుక అవినీతిని ప్రోత్సహించడం వల్లే కేసుల్లో జాప్యం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేల లేఖ ఉంటే పోలీసులకు పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇష్టం వచ్చిన చోటకు వెళ్తున్న కొందరు పోలీసులు అవినీతి సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారు.సైబరాబాద్‌లో 63 మందికి పోస్టింగ్ ఇస్తే మార్పులు చేర్చులకు పట్టుబట్టారు.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు. ప్రతీ అంశంలో వేలు పెడుతూ పోలీసులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ పట్టుకుంటుంది కదా అని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానాలి. ఇప్పటికైనా పరిస్థితిని అదుపు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం తప్పదు. ప్రజలు సైతం చీదరించుకుంటున్నారు. మొత్తం డిపార్ట్‌మెంట్‌కు కూడా అవినీతి మరకలు అంటుకుంటాయి.

#currupt cops#Telangana#police#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి