Spirituality

Spirituality: గణేషుడి నిమజ్జనం మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి?.

రచన: Venu4 నిమిషాల పఠనం

పురాణ, ఆగమ సంప్రదాయాల భావనలో గణపతి ప్రకృతి తత్వానికి ప్రతీక. భూమి నుంచి రూపాన్ని తీసుకున్న విగ్రహం.. పూజ ద్వారా దైవస్వరూపంగా ఆరాధించబడుతుంది. అనంతరం నిమజ్జనంతో ఆ రూపం మళ్లీ పంచభూతాల్లో కలిసిపోతుంది.

గణేషుడి నిమజ్జనంతో మనిషి జీవితానికి సనాతన ధర్మం అందించే గొప్ప ఆధ్యాత్మిక సందేశంగా చెబుతారు.. వినాయకుడిని మట్టితో ప్రతిష్ఠించి.. భక్తిశ్రద్ధలతో పూజించి.. చివరకు అదే మట్టిని నీటిలో కలపడం వెనుక లోతైన తత్వం దాగి ఉందని అంటారు.

పురాణ, ఆగమ సంప్రదాయాల భావనలో గణపతి ప్రకృతి తత్వానికి ప్రతీక. భూమి నుంచి రూపాన్ని తీసుకున్న విగ్రహం.. పూజ ద్వారా దైవస్వరూపంగా ఆరాధించబడుతుంది. అనంతరం నిమజ్జనంతో ఆ రూపం మళ్లీ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది సృష్టి, స్థితి, లయ అనే ప్రకృతి చక్రాన్ని మన కళ్లముందు చూపించే ఆధ్యాత్మిక ప్రక్రియగా భావించవచ్చు.

వినాయకుడి నిమజ్జనం మనిషికి మొదటగా చెప్పేది.. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అనే సత్యం. మన శరీరం కూడా పంచభూతాల నుంచే ఏర్పడింది. ఒకరోజు అదే పంచభూతాల్లో కలిసిపోతుంది. సంపద, హోదా, పేరు, అధికారం.. ఇవన్నీ మనతో శాశ్వతంగా రావు అని సూచిస్తుందంటారు.. అలాగే మట్టి విగ్రహం నీటిలో కలిసిపోయినా.. గణపతి తత్వం భక్తుడి హృదయంలో నిలిచిపోతుంది. భగవంతుడిని ఒక రూపంలో ఆరాధించడం భక్తికి మార్గం.. ఆ రూపం వెనుక ఉన్న పరమతత్వాన్ని గ్రహించడం ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గం.

ఇక గణపతిని విఘ్నేశ్వరుడిగా పూజిస్తాం. నిమజ్జన సమయంలో మనలోని అహంకారం, మమకారం, లోభం, కోపం వంటి అంతర్గత విఘ్నాలను కూడా ఆయన పాదాల వద్ద సమర్పించాలనే భావన అందులో ఉంది. ఇక వచ్చేది ప్రకృతి నుంచే.. వెళ్లేది ప్రకృతిలోకే.. మధ్యలో మనం చేసే జీవన ప్రయాణమే అసలు సాధనగా ఆథ్యాత్మిక గ్రంధాలు పేర్కొంటాయి. అందుకే దైవాన్ని ఇంటికి ఆహ్వానించడమే కాదు.. దైవం చూపించిన సత్యాన్ని జీవితంలో నిలబెట్టుకోవాలి. రూపం కనుమరుగైనా.. భక్తి, జ్ఞానం, ధర్మం మనలో కొనసాగాలని వేదాలు చెబుతాయి..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Ganesha immersion#human life#Sanatana Dharma#spiritual message
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి