National

CJP : తీహార్ జైలుకు సౌరవ్, రంకా.. మోడీ ఇంత పిరికివాడా? : అభిజీత్ దీప్కే

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

దేశంలో ఎస్ఐఆర్ రద్దు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జరుగుతున్న నిరసన ఆగ్రహాజ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

దేశంలో ఎస్ఐఆర్ రద్దు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జరుగుతున్న నిరసన ఆగ్రహాజ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఓటు చోరీ పేరిట నిర్వహిస్తున్న ఆందోళనల కారణంగా ప్రజలు, వాహనదారులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలు నిర్వహించే ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను ఢిల్లీ ప్రభుత్వం తొలగించింది.

తమ డిమాండ్ల సాధనకు ఎవరైనా శాంతియుతంగా నిరసనలు తెలిపాలంటే రామ్ లీలా మైదానంతో పాటు మరో రెండు ప్రాంతాలను ఎంచుకోవాలని ఢిల్లీ పోలీసులు సూచించారు.ఈ క్రమంలోనే సీజేపీ జాతీయ ప్రతినిధులు సౌరవ్ దాస్,ఆశుతోష్ రంకాలు నిన్న పోలీసుల అనుమతి లేకుండా జంతర్ మంతర్‌లో నిరసనలు చేపట్టారు. జాతీయ జెండాను చేతబట్టుకుని నిరననలు తెలపగా.. ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించారని వారి మీద అభియోగం మోపారు.

ఈ క్రమంలోనే వారిని ఇవాళ ఉదయం న్యాయస్థానంలో హాజరుపరచగా.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్‌లకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారని కేసు ఫైల్ చేసిన నేపథ్యంలో ఈ శిక్ష విధించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇద్దరిని తీహార్ జైలుకు తరలించారు. అయితే, జంతర్ మంతర్ వద్దకు రావాలని ప్రజలకు ఆ ఇద్దరు పిలుపు ఇచ్చారని పోలీసులు కోర్టులో అబద్ధం చెప్పారని సౌరవ్, ఆశుతోష్ తరఫు లాయర్ మీడియాకు వెల్లడించారు. వాళ్లు ఎలాంటి పిలుపు ఇవ్వలేదని, బాండ్‌ను కూడా ఉల్లంఘించలేదని స్పష్టతనిచ్చారు.

అభిజీత్ మండిపాటు..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఊపితే నేరమా? అంటూ సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఐదు రోజుల కస్టడీ విధించడంపై అభిజీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాని మోదీకి దేశంలో ఎమర్జెన్సీ విధించాలని అనిపిస్తే అధికారికంగానే చేయండంటూ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల చాటున దాక్కొని.. ఇలా పిరికివారిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాను ఊపినందుకు 5 రోజుల కస్టడీ విధించడం అనేది ఎమర్జెన్సీలోనూ జరగలేదని అభిజీత్ గుర్తుచేశారు.

#CJP#souravdas#Ashutosh ranka#police custody#tihar jail#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి