తెలంగాణ

Crime : కూతురికి వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి ఘోరం

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. కొందరు వావివరసలు మర్చి ప్రవర్తిస్తున్నారు. సోదరి, కూతురు, మనవరాలు అనే తేడా లేకుండా లైంగికవేధింపుల పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. సభ్యసమాజం తలదించుకునే ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నా, వారికి శిక్షలు పడుతున్నా కొందరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. కొందరు వావివరసలు మర్చి ప్రవర్తిస్తున్నారు. సోదరి, కూతురు, మనవరాలు అనే తేడా లేకుండా లైంగికవేధింపుల పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. సభ్యసమాజం తలదించుకునే ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నా, వారికి శిక్షలు పడుతున్నా కొందరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మనిషి రూపంలో మృగంలా బిహేవ్ చేస్తున్నారు. మైనర్లు, చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కూతురు వరసయ్యే బాలికతో సవతి తండ్రి అసభ్యంగా ప్రవర్తించాడు. కొంతకాలం నుంచి ఈ వ్యవహారం జరుగుతుండగా బాధితురాలు ఆలస్యంగా తల్లి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన తల్లి బుద్ధిమార్చుకోవాలని తన భర్తకు సూచించింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కుటుంబసభ్యులతో కలిసి దారుణానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ తండాకు చెందిన బానోతు రాజేశ్వరి(33)కి గతంలో పెళ్లి అవ్వగా.. భర్త చనిపోవడంతో కుమార్తెను పోషిస్తూ జీవనం కొనసాగిస్తోంది.ఈ క్రమంలోనే ఆమెకు జనగామకు చెందిన భగవాన్‌తో రెండో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఓ కుమారుడు ఉన్నారు.రాజేశ్వరి మొదటి భర్త ద్వారా జన్మించిన కుమార్తె హుస్నాబాద్‌లోని కేజీబీవీలో చదువుకుంటోంది.

అయితే, సవతి తండ్రి భగవాన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు తల్లికి చెప్పింది.ఈ విషయంపై భర్తను రాజేశ్వరి ప్రశ్నించగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అక్టోబర్ 11న వివాదం పరిష్కరించేందుకు భగవాన్‌ను రాజేశ్వరి బంధువులు పిలిపించారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో భగవాన్‌కు చెట్టుకు కట్టేసి రాజేశ్వరి బంధువులు దేహశుద్ధి చేశారు.

ఆపై కర్ర, ఇనుప రాడ్‌తో బలంగా తలపై కొట్టడంతో భగవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బానోతు రాజేశ్వరి, దాడి చేసిన బంధువుల్ని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

#Crime#husband#killed#sexual harrasment case#siddipet#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి