Rashmika Mandanna: ప్రస్తుతం, మన టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది రణబాలి సినిమా. మరికొన్ని గంటల్లో ఈ సినిమా భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి గట్టి పోటీ ఇవ్వబోతుంది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బ్లాక్ బస్టర్ జైలర్ 2. నెలన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. తెలుగులో కూడా మంచి ఆసక్తి నెలకొంది. అయితే, ఇండస్ట్రీలో వినిపిస్తున్నదాని ప్రకారం రణబాలి సినిమాకి ప్రధాన బలంగా మారింది రష్మిక మందన్న..అంటున్నారు.
రణబాలి ప్రాజెక్ట్ కి కీలకంగా మారిన రష్మిక:
దాదాపు 8 ఏళ్ళ నుంచి విజయ్ దేవరకొండకి సక్సెస్ దక్కలేదు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాపవుతూ వచ్చింది. దీనికి, తోడు విజయ్ కి యాటిట్యూడ్ అని ఆయన సినిమాలను రిలీజ్ సమయంలో బాగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా సినిమాకి విజయ్ నెగిటివ్ మెటీరియల్‌గా మారాడు. గత చిత్రాలు పెళ్లి చూపులు, గీత గీవిందం, అర్జున్ రెడ్డి లాంటి సెన్షేషనల్ హిట్స్‌ను మర్చిపోయి..ఫ్లాప్ సినిమాల గురించే మాట్లాడి నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు.
ఇదే, సమయంలో ఈ ఏడెనిమిదేళ్ళలో రష్మిక మందన్న భారీ సక్సెస్‌లతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారింది. ఇటు సౌత్ అటు నార్త్ రష్మిక మార్కెట్ విపరీతంగా పెరిగింది. టాక్సీవాలా సినిమా రాహుల్ సాంకృత్యన్, విజయ్ కాంబినేషన్లో వచ్చి డీసెంట్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రాహుల్ చేసిన సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించలేదు. ఇప్పుడు, వస్తున్న రణబాలి సినిమాకి వీళ్ళిద్దరికంటే కూడా రష్మిక మందన్నకి ఉన్న క్రేజ్ వల్లే సినిమా బిజినెస్ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది. దాదాపు 100 కోట్లకి పైగానే నిర్మాణానికి బడ్జెట్ అయిందట.
ఈ సినిమా సక్సెస్ సాధించాలంటే విజయ్ ముందు పెద్ద ఛాలెంజే ఉంది. విజయ్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ వల్ల డిస్ట్రిబ్యూషన్, ఓటీటీ బిజినెస్‌కి సంబందించిన డీల్స్ కూడా కాస్త మేకర్స్ ఆశించిన స్థాయిలో జరగలేదని టాక్ వినిపించింది. కానీ, ఇటీవల మైత్రీ నుంచి వచ్చిన ఇరుముడి సినిమా భారీ విజయం, హీరోయిన్ రష్మిక మందన్నకి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ వల్ల మొత్తానికి, మంచి బిజినెస్ జరిగిందట. అందుకు, తగ్గట్టుగా గనక రణబాలి పాన్ ఇండియా వైడ్‌గా హిట్ సాధిస్తే..8 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న హిట్ గ్యారెంటీ..కొత్త రికార్డులు కూడా నమోదు కావచ్చు. చూడాలి, మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో.


