తెలంగాణ

Ramlila Maidan : రామ్ లీలాలో నిరసనలు కష్టమే.. ప్లాన్ ప్రకారమే సెలెక్ట్ చేశారా?

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

దేశ వ్యాప్తంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. జంతర్ మంతర్‌ కు నిరసన వేదిక హోదాను రద్దు చేస్తూ ఢిల్లీ పోలీసులు మూడు స్థానాలను సూచించిన విషయం తెలిసిందే.

Ramlila Maidan : దేశ వ్యాప్తంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. జంతర్ మంతర్‌ కు నిరసన వేదిక హోదాను రద్దు చేస్తూ ఢిల్లీ పోలీసులు మూడు స్థానాలను సూచించిన విషయం తెలిసిందే. అయితే వీటిలో రామ్ లీలా మైదాన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడ జరిగే ఏ ప్రోగ్రామ్ అయినా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ నిరసన చేయడం అంత తేలిక కాదని తేలిపోతున్నది. ఎందుకంటే ఇక్కడ నిరసన చేయాలంటే ఒక రోజుకు రూ.1.21 లక్షలు కట్టాల్సిందే.

ఇందులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పన్నులు, జీఎస్టీ లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ నిరసన తెలిపేందుకు కేవలం 50వేల మంది మాత్రమే కూర్చోవచ్చు. అయితే ఇక్కడే ఇంకో కిటుకు ఉంది. ఆల్రెడీ ఈ మైదాన్‌ లో అనేక ప్రోగ్రామ్స్ ముందే బుక్ అయిపోయి ఉన్నాయి. ఈ ఏడాదిలో డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో మాత్రమే నిరసన తెలిపేందుకు అవకాశం ఉంది. అప్పటి దాకా ఇక్కడ అనేక ప్రోగ్రామ్స్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

దీంతో ఇక్కడ నిరసన తెలపాలంటే అప్పటి దాకా ఆగడం కష్టం. ప్రస్తుతం ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ లెక్కన ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం ఈ మైదాన్ ఇప్పట్లో ఖాళీ లేదనే విషయం తెలిసే దీన్ని సెలెక్ట్ చేశారా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు యువత. జంతర్ మంతర్ నే నిరసన వేదికగా కొనసాగించాలంటూ అనేక డిమాండ్లు వస్తున్నాయి. దాన్ని పునరుద్ధరించకపోతే యావద్దేశం ఒక జంతర్ మంతర్ లా తయారవుతుందని ఇప్పటికే సీజేపీ వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ విషయంలో కేంద్రం వెనక్కు వస్తుందా లేదా చూడాలి.

#Ramlila Maidan#Jantar Mantar#Delhi Protests#Gyanesh Kumar#Chief Election Commissioner#CEC Controversy#Delhi Police#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి