తెలంగాణ

ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ భూకబ్జా బాగోతం..! వృద్ధాశ్రమం కోసం కొన్న భూమిని ఆక్రమించిన వైనం!

రచన: NK•••5 నిమిషాల పఠనం

Land Grab: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భూకబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది. వృద్ధాశ్రమం కోసం కొన్న భూమిని బల్మూర్ వెంటక్ ఆక్రమించిన వైనం బట్టబయలైంది. మేడ్చల్ జిల్లా బౌరంపేట్ గ్రామ పరిధిలోని 259/P సర్వే నెంబర్‌లో గల 3.35 ఎకరాల భూమిని బల్మూర్ వెంకట్ కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Land Grab: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భూకబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది. వృద్ధాశ్రమం కోసం కొన్న భూమిని బల్మూర్ వెంకట్ ఆక్రమించిన వైనం బట్టబయలైంది. మేడ్చల్ జిల్లా బౌరంపేట్ గ్రామ పరిధిలోని 259/P సర్వే నెంబర్‌లో గల 3.35 ఎకరాల భూమిని బల్మూర్ వెంకట్ కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

వృద్ధులకు ఆశ్రయం కల్పించాలనే మంచి ఉద్దేశంతో వృద్ధాశ్రమం కోసం పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ఈ భూమిని కొనుగోలు చేసింది. ఆ భూమిని బల్మూర్ వెంకట్ కబ్జా చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన సీపీఎం నాయకులు రంగంలోకి దిగారు. ట్రస్ట్‌కు మద్దతుగా నిలిచారు. భూ కబ్జాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. భూమిని కబ్జా చేసుకుని ఏర్పాటు చేసిన రేకులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అనుచరులు సీపీఎం నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

బల్మూర్ వెంకట్ అనుచరులు రెచ్చిపోయారు. నిరసనకు దిగిన సీపీఎం నాయకులపై రాళ్లు, బీర్ సీసాలు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడులతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమపై బల్మూర్ వెంకట్ అనుచరులు రౌడీయిజం చేశారని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని, రాష్ట్రంలో యధేచ్చగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు ఉద్దేశించిన భూమికే రక్షణ లేకపోతే ఎలా? అని వాపోతున్నారు. ప్రజా ప్రయోజనం కోసం కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, భూ కబ్జాకు పాల్పడిన బల్మూర్ వెంకట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బల్మూర్ వెంకట్ కబ్జా కోరల నుంచి భూమిని విడిపించి పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ కు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

''వృద్ధాశ్రమం నిర్మాణం కోసం 4 ఎకరాల భూమిని పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ తరుపున 2024లో కొనుగోలు చేశాం. అది పట్టా భూమి. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా మాకు వచ్చాయి. రాజేంద్రనగర్ లోని సర్వే నెంబర్ పెట్టి బోగస్ డాక్యుమెంట్స్ సృష్టించారు. అన్యాయంగా భూమిని కబ్జా చేసుకున్నారు. అడ్డుకునేందుకు వస్తే రౌడీలతో రాళ్లు, బీర్ల సీసాలతో దాడులు చేయించారు. అధికారులు స్పందించాలి. మాకు న్యాయం జరిగేలా చూడాలి'' అని పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ కు చెందిన వ్యక్తులు డిమాండ్ చేశారు.

#Land Grab#Allegations#Telangana Congress#Venkat Balmoor#Medchal#Bowrampet#Peoples Progressive Trust#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి