తెలంగాణ

NIMS : నిమ్స్‌ వెళ్లే వారికి అలర్ట్‌.. పార్కింగ్‌ కోసం వాటినే ఉపయోగించాలి

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

హైదరాబాద్ లోని ఫేమస్ నిమ్స్ హాస్పిటల్ కు కీలక ప్రకటన చేసింది. నిమ్స్ హాస్పిటల్ లో మూడు నెలల పాటు సీసీ రోడ్ల పనులు దశలవారీగా జరుగుతాయని తెలిపింది. నిమ్స్ ప్రాంగణంలోని పంజాగుట్ట ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్, మిలీనియం, ఫిజియోథెరపీ బ్లాక్, డయాలసిస్ వెయిటింగ్ ఏరియా, వెల్‌నెస్ సెంటర్, ఎన్‌పీఆర్‌ బ్లాక్, యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్న సిబ్బంది పార్కింగ్ స్థలం ప్రాంతాల్లో ఈ పనులు కొనసాగుతాయి.

NIMS : హైదరాబాద్ లోని ఫేమస్ నిమ్స్ హాస్పిటల్ కు కీలక ప్రకటన చేసింది. నిమ్స్ హాస్పిటల్ లో మూడు నెలల పాటు సీసీ రోడ్ల పనులు దశలవారీగా జరుగుతాయని తెలిపింది. నిమ్స్ ప్రాంగణంలోని పంజాగుట్ట ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్, మిలీనియం, ఫిజియోథెరపీ బ్లాక్, డయాలసిస్ వెయిటింగ్ ఏరియా, వెల్‌నెస్ సెంటర్, ఎన్‌పీఆర్‌ బ్లాక్, యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్న సిబ్బంది పార్కింగ్ స్థలం, నర్సింగ్ హాస్టల్‌కు వెళ్లే మార్గం, డాక్టర్స్ క్లబ్ ఎదురుగా ఉన్న డాక్టర్ల పార్కింగ్ స్థలం, CSSD ,జనరల్ స్టోర్స్‌కు వెళ్లే మార్గం, పోర్టికో, సాధారణ పార్కింగ్ ప్రాంతాల్లో ఈ పనులు కొనసాగుతాయి.

నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో హాస్పిటల్ ప్రాంగణంలో పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపడానికి వీలుండదని హాస్పిటల్ మేనేజ్ మెంట్ వెల్లడించింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హాస్పిటల్ కు వచ్చేవారు కచ్చితంగా ప్రజా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని హాస్పిటల్ కు రావాలని కోరింది. అంటే సొంత బైకులు, కార్లలో రాకుండా ఆర్టీసీ బస్సులు, ఆటోలు, మెట్రో లేదంటే ర్యాపిడో లాంటి సేవలను ఉపయోగించుకుని రావాలని సూచించింది. అత్యవసర సమయాల్లోనే సొంత వాహనాలు తీసుకురావాలని కోరింది.

#NIMS Hospital#NIMS Hyderabad#Hyderabad News#Punjagutta#Road Construction#Parking Restrictions#Hospital Advisory#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి