స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

TG : తెలంగాణలో పడకేస్తున్న పాలన?

రచన: Kumar••8 నిమిషాల పఠనం

రాష్ట్రంలో రెండే విషయాలు నడుస్తున్నాయి. రైతుల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ అనుచరుల ఆగడాలు. అన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్ అధోగతిలా పడి ఉంటోంది.ఎవరు ఎవరి మాటా వినని పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఆశ చూపిన వారికి, ముఖ్యమంత్రికి వీళ్లు దగ్గర అనే వ్యక్తులకు మాత్రమే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.

- తెలంగాణ ప్రజల కంటే ఢిల్లీ పార్టీయే ముఖ్యమైందా?

- పొలాలకు నీళ్లు పెట్టకపోతే రూ.20 వేల కోట్ల రైతుల సొమ్ము ఆవిరి?

- కరువుపై కమిటీ సూచనలు ఏవి.. చర్యలు ఎక్కడ?

- సర్కారు దిక్కుమాలిన పనులతో దిక్కులేని వారిగా రైతన్నలు?

- భరోసా కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్?

- సమస్యలను అగ్రెసివ్‌గా ప్రజల ముందు పెడుతున్నహరీశ్ రావు

----------------

బరితెగిస్తున్న బంధుగణం?

- అనుచరుల ఆగడాలకు అంతే లేదా?

- ముఖ్యమంత్రి ఒక్క పని చేయాలని చెబితే 10 పనులు చేసి పెడుతున్న అధికారులు?

- ఎవరి కోటా ఏంటో డిసైడ్ చేసిన రేవంత్?

- అత్యుత్సాహంతో అనేక పనుల్లో చేయి పెడుతున్న తీరు?

- పార్టీ + పర్సనల్ ఫ్రెండ్స్‌గా పనులు చేసుకుంటున్న వైనం

- అనధికారిక ఎలక్షన్ ఫండ్ ఇచ్చిన వారికి నాలుగింతల లాభాలు?

- వెంటనే ఉండి నడిచిన ఆ 10 మంది గ్యాంగ్‌కు రూ.500 కోట్లు?

- సెకండ్ లేయర్‌కు రూ.100 కోట్ల వరకు చేస్తే సరిపోతుందని ఆదేశాలు

- మూడో లేయర్‌లో ఉండే అనుచరులకు భూ పంచాయితీల్లో క్లియరెన్స్?

- నాలుగో లైన్‌లో హెల్ప్ చేసిన వారికి ఫ్రీహ్యాండ్?

- ఎవరికి ఏం చేయాలో అది చేసుకుంటూ దోచిపెడుతున్న వైనం

- రాష్ట్రంపై గద్దల్లా వాలుతూ ఒక్క పనికి 20 పనులు చేయాలని ఒత్తిడి?

- అధికారులకు వాటాలు, డబ్బులు అశ పెట్టడంతో విధులు మర్చి వారికోసమే పనులు?

- ఒకవైపు రైతులకు కనీస అవసరాలు లేని గోసలో తెలంగాణ

- మరోవైపు బరితెగించి కబ్జాలు, కాంట్రాక్టులు, టెండర్లతో వందల కోట్ల అవినీతి?

- పెరిగిపోతున్న విచ్చలవిడితనం.. అదుపు తప్పిన అడ్మినిస్ట్రేషన్?

- స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

రాష్ట్రంలో రెండే విషయాలు నడుస్తున్నాయి. రైతుల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ అనుచరుల ఆగడాలు. అన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్ అధోగతిలా పడి ఉంటోంది.ఎవరు ఎవరి మాటా వినని పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఆశ చూపిన వారికి, ముఖ్యమంత్రికి వీళ్లు దగ్గర అనే వ్యక్తులకు మాత్రమే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.రేవంత్ రెడ్డి ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలో ఇప్పటికే చేసేశారని టాక్.కానీ,వాళ్లు రోడ్డు మీద పడి సెటిల్మెంట్లు అంటూ ఎన్నో ఆగడాలు సృష్టిస్తున్నారు.

1. జానారెడ్డి కుమారులు రాజకీయంగా ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారు. స్కూల్స్ టెండర్స్‌లో ఎవరు ఎన్ని చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడంతో ఆ కోటాలో రూ.80 కోట్లు కొట్టేశారు.మరో టెండర్స్‌లో అలానే సంపాదించారు.ఇవి కాకుండా మరిన్ని చేసుకునేందుకు ఫైల్స్ సిద్ధమయ్యాయి.

2. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సింది, సలహాదారుడిగా ఇచ్చేశారు.

3. అనుచరుల్లో ఏవీ రెడ్డి చేసిన ఫైనాన్స్‌కు నాలుగింతలు సంపాదించేశారు.

4. మరో ఉదయ్ సింహా రూ.500 కోట్లు దాటినట్లు టాక్? అయినా ఆశ తగ్గకుండా లిటిగేషన్ భూముల్లో వేలు పెట్టడం అలవాటు అయింది.

5. మరో వ్యక్తి పార్టీకి ఫండ్స్ మొబలైజ్‌లో భారీగా పక్కన వేశారని విశ్వసనీయ సమాచారం?

6. చుట్టూ ఉండే ఆ 10 మందికి ఇప్పటికే రూ.500 కోట్లకు తక్కువ కాకుండా మేలు చేశారని సన్నిహితులు అంటున్నారు.

7. అయినా బరి తెగించి సెటిల్మెంట్ల రూపంలో ఫైల్స్ తీసుకెళ్లుతుండటంతో ముఖ్యమంత్రి కొంతమందిని పక్కన పెట్టారని తెలుస్తోంది.

ఇలా రూ.10 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు కేటగిరి విధించి హెల్పింగ్ చేస్తున్న తీరుకి ఒక 100 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. ఆశ తగ్గకపోవడంతో అధికారులు ఆ వంకతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై పట్టులేదని విమర్శలు వస్తున్నాయి. బౌరంపేట్‌లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కబ్జా బాగోతంపై, దాడులు లాంటివి చేయడం దేనికి నిదర్శనమో ప్రజలు గమనిస్తున్నారు.

పంటలపై రైతులను ఆదుకునేది ఎప్పుడు?

అనుచరులు ఎంత సంపాదించుకున్నా రైతులకు పంట పండి చేతికి నాలుగు రూపాయలు వస్తే ఎవరు అంతగా పట్టించుకోరు. కానీ, రైతాంగ వనరులు ఆగమ్యగోచరంగా ఉంటే మీడియా, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి. ఒక్క ఈ సీజన్‌లోనే రైతులకు పంట చేతికి రాకపోతే పెట్టుబడి ఖర్చే రూ.20 వేల కోట్లు అవిరి కానున్నాయి. కనీసం కరువు కమిటీ అంచనాలు, రైతులకు భరోసా, క్రాప్ హలీడే లాంటివి ముందే ప్రకటించి అవగాహన కల్పించాలి. కానీ, ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. కరెంట్ లేకుండా పోతోంది. కాళేశ్వరం నీళ్లు వాడుకోలేని పరిస్థితి.ఎల్ నినోతో తాగు నీరు ఎలా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి అపోహాలకు చెక్ పెట్టేలా ఎవరూ మాట్లాడటం లేదు.మంత్రులు నేరుగా మాట్లాడితేనే తెలుస్తుంది.

హరీశ్ రావు ఫైటింగ్

నిత్యం ప్రజల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైట్ చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా, ప్రెస్ మీట్లు పెట్టి, ఫీల్డ్‌లో తిరుగుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. సింగూరు నీళ్లు బీర్లకేనా, తాగు నీరుకా అంటూ విరుచుకపడ్డారు.కరెంట్ కష్టాలపై డిస్కం వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు. మీ గురువుకు దక్షణంగా నీళ్లు ఇచ్చావా? అంటూ ఎద్దేవా చేశారు. ఇలా అనేక అంశాలపై చర్చించేలా ఫైటింగ్ చేస్తున్నారు. కేటీఆర్ పెద్ద సమస్యలపై పోరాటానికి సభలు ఏర్పాటు చేయడం, క్యాడర్‌లో డిఫరెన్స్ రాకుండా ఇద్దరు వ్యవహరిస్తున్నారని కనిపిస్తోంది.

తర్వాత మరో సంచలన కథనం

బీజేపీ నేతల నేతి బీరకాయ, కవిత కహానీలు, తీన్మార్ బీసీ వాదం అన్నింటినీ 5 శాతం ఓటింగ్ కోసం ఎలా నడుపుతున్నారు.వాళ్లకు ఎలాంటి ఫైల్స్ క్లియర్ అయ్యాయి. ఎలాంటి లోపాయికారి ఒప్పందం ఉందో మరో కథనంలో చూద్దాం.

#Congress#Telangana#government#administration#failed#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి