సినిమా

Prabhas: నిర్మాణ సంస్థలను ఆదుకుంటున్న రెబల్ స్టార్..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Prabhas: మన హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ అంటే ప్రతీ ఒక్కరిలో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. దీనికి, కారణం ఆయన మనస్తత్వం. రెబల్ స్టార్ కృష్ణం రాజు మాదిరిగానే ఆయన కొడుకు ప్రభాస్ కూడా అభిమానులన్నా, నిర్మాతలన్నా ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు. తన అభిమానుల కోసం, ఇండస్ట్రీలో ఉన్న తోటి నటుల కోసం ఆయన ఇచ్చే విందు చాలు..ఎంత అభిమానం చూపిస్తారో. అలాగే, సినిమా పోతే నిర్మాతను ఆదుకునే పద్ధతి చూస్తే ఇలాంటి హీరో కదా.. ఉండాల్సింది అని చెప్పకుండా ఉండలేరు.

ఇప్పుడు, ఇండస్ట్రీలో కాస్త వెనకబడిన నిర్మాణ సంస్థ ప్రభాస్ సన్నిహితులు నిర్మాణం వహిస్తున్న యూవీ క్రియేషన్స్. గత కొంతకాలంగా ఈ సంస్థకి ఆశించిన లాభాలు రావడం లేదు. అయినా, కూడా ప్రభాస్ సపోర్ట్‌తో ఈ సంస్థ కొనసాగుతోంది. ఇంకా, విశ్వంభర చిత్రం వీఎఫెక్స్ కి బడ్జెట్ లేక ఆలస్యం అవుతోంది. ఇలా, ఎప్పుడూ జరగలేదు. తన సొంత నిర్మాణ సంస్థ నష్టాల్లో ఉన్నా కూడా బయట సంస్థలను ఆదుకుంటున్నాడు ప్రభాస్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. దాంతో, రాజాసాబ్ సినిమాకి డేట్స్ ఇచ్చి..మళ్ళీ విశ్వప్రసాద్‌ను లాభాల్లోకి తేవాలనుకున్నాడు. కానీ, మారుతి కొట్టిన దెబ్బతో తీవ్రంగా నష్టపోయాడు విశ్వప్రసాద్. దాంతో, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా ప్రకటించాలంటే నిర్మాత ఆలోచించాల్సిన పరిస్థితి.

ఇది, ప్రభాస్‌ను కాస్త బాదించింది. 2028లో మళ్ళీ విశ్వప్రసాద్‌కు డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. ఈసారి ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండానే సినిమాను చేయనున్నాడు. లాభాలు వస్తే తప్ప తన రెమ్యునరేషన్ తీసుకోనని నిర్మాతకి చెప్పినట్టుగా తెలుస్తోంది. నిజంగా, ఇలాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. సినిమా పోతే నాకేంటి..లాభాలు వస్తే నాకేమైనా ఇస్తావా? అని కొందరు హీరోలు ఆలోచిస్తున్నారు కూడా. కానీ, ప్రభాస్ వీరందరికంటే డిఫరెంట్. అందుకే, విశ్వప్రసాద్‌ను ఆదుకుంటున్నాడు. కాగా, ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, ఫౌజీ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఈ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

#Prabhas#TG VIshwaprasad#Peoples Media Factory#Tollywood#Adipurush#The Rahasaab
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి