National

National : సీజేపీ వెనుక అమెరికా.. నిధుల వరద పారుతోంది : అమెరికా సింగర్ మేరీ మిల్బెన్

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహిస్తున్న ఆందోళనల వెనుక అమెరికా హస్తం ఉందని ఆ దేశానికి చెందిన సింగర్ మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఓటు చోరీ, ఎస్ఐఆర్‌లో సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఓట్ల చోరీకి పాల్పడుతూ కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు సీజేపీ పట్టుబడుతోంది.

భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహిస్తున్న ఆందోళనల వెనుక అమెరికా హస్తం ఉందని ఆ దేశానికి చెందిన సింగర్ మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఓటు చోరీ, ఎస్ఐఆర్‌లో సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఓట్ల చోరీకి పాల్పడుతూ కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్రఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే, ఆ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ముందుగా నిరసనలు తెలిపిన సీజేపీ ప్రతినిధులు గత రెండు, మూడు రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు నిర్వహించడానికి వీల్లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. భవిష్యత్‌లోనూ నిరసనలు చేపట్టకుండా జంతర్ మంతర్‌ను నిరననలు తెలిపే ప్రదేశాల జాబితా నుంచి నిషేధించారు.

పారుతున్న అమెరికా నిధుల వరద..

ఇదిలాఉండగా, సీజేపీ ప్రతినిధులు కేంద్రానికి వ్యతిరేకంగా పదే పదే నిరసనలు తెలపడం, దేశంలో అశాంతిని రగిలించడం వెనుక అమెరికా కుట్ర ఉందని ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ బాంబు పేల్చారు. ఇండియాలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సీజేపీకి అమెరికాలోని కొందరు డోనర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ సీజేపీ ఫౌండర్ అభిజీత్, విపక్ష కూటమి నిరసనలకు దిగుతున్న తరుణంలో అమెరికన్ సింగర్ ట్వీట్ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీకి, ఆయన నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతికి వ్యతిరేకంగా ఉన్న అమెరికా శక్తులే కాక్రోచ్ పార్టీ వెనుకండి నడిపిస్తున్నాయని మిల్బెన్ స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు విదేశీ నిధులతో సాగుతున్న ఈ విద్రోహ చర్యలపై మౌనంగా ఉండే సమయం ఇది కాదని మేరీ మిల్బెన్ పేర్కొన్నారు.

యువత ప్రతినిరసన చేపట్టాలి

అంతర్జాతీయ సంప్రదాయవాద పాలకులను లక్ష్యంగా చేసుకుని అమెరికాలో చదువుకున్న వారిని ఎంపిక చేసి, వారిని స్వదేశాలకు పంపి అశాంతి రేకెత్తించే కుట్రపూరిత విధానం నడుస్తోందని ఆమె కీలక ప్రకటన చేశారు. ఇండియా ఫ్యూచర్ కోసం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు దేశభక్తులైన భారతీయ యువత మేల్కొనాలని పిలుపునిచ్చారు. సీజేపీ వంటి విధ్వంసకర శక్తులకు వ్యతిరేకంగా, శాంతియుతంగా ప్రతి-ఉద్యమాన్ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉంటూ 3 సార్లు వరుసగా ఎన్నికైన ప్రధాని మోడీ ఇలాంటి కుతంత్రాలకు లొంగిపోరు అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

#CJP#protests#America funds#singer meri milben#national#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి