సినిమా

Shraddha Kapoor: స్త్రీ 2 తర్వాత శ్రద్దా కపూర్ సినిమాల ఎంపికలో చాలా మార్పులు..

5 నిమిషాల పఠనం

Shraddha Kapoor: ఆషికీ 2తో అటు బాలీవుడ్ ఇటు సౌత్‌లో బాగా గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా కపూర్. ఆ గుర్తింపుతోనే తెలుగులో సాహో లాంటి పాన్ ఇండియా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా..మనవాళ్ళకి మాత్రం బాగానే నచ్చింది. కానీ, ఇక్కడున్న సక్సెస్ సెంటిమెంట్ వల్ల మళ్ళీ టాలీవుడ్ నుంచి అవకాశాలను అందుకోలేకపోయింది. అంతేకాదు, స్త్రీ 2 లాంటి భారీ హిట్ తర్వాత కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది శ్రద్ధా.

Shraddha Kapoor: ఆషికీ 2తో అటు బాలీవుడ్ ఇటు సౌత్‌లో బాగా గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా కపూర్. ఆ గుర్తింపుతోనే తెలుగులో సాహో లాంటి పాన్ ఇండియా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా..మనవాళ్ళకి మాత్రం బాగానే నచ్చింది. కానీ, ఇక్కడున్న సక్సెస్ సెంటిమెంట్ వల్ల మళ్ళీ టాలీవుడ్ నుంచి అవకాశాలను అందుకోలేకపోయింది. అంతేకాదు, స్త్రీ 2 లాంటి భారీ హిట్ తర్వాత కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది శ్రద్ధా.

బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా అరడజను సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్న హీరోయిన్స్ ఉన్నారు. కానీ, వీరిలో ఇప్పుడు శ్రద్ధా కపూర్ కాస్త భిన్నంగా ఆలోచించుకుంటోంది. ముఖ్యంగా, ఆమె సినిమాల ఎంపిక విషయంలో ఆలోచనా విధానం మార్చుకుంది. గతంలో వరుసగా సినిమాలు చేసిన ఆమె.. ఇప్పుడు మాత్రం కథ, పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి, కారణం ఇండస్ట్రీలో 4 హిట్స్ తర్వాత వచ్చిన ఒక్క ఫ్లాప్ విపరీతంగా ఉంటోంది కాబట్టి.

‘స్త్రీ 2’తో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఉందని శ్రద్ధా మరోసారి నిరూపించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆమె ఎలాంటి సినిమాలు ఎంచుకుంటారు? గతంలో మాదిరిగా కమర్షియల్ సినిమాలు చేస్తారా? లేక నటనకు అవకాశం ఉన్న విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిన మాట వాస్తవం. అయితే, శ్రద్ధా కపూర్ తాజాగా తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘స్త్రీ 2’ తర్వాత తనకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని, భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు ముందుకు వచ్చారని ఆమె తెలిపారు.

అయినప్పటికీ, నచ్చిన కథ దొరికే వరకు మరో సినిమా అంగీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. సరైన కథ కోసం ఎదురుచూడటం కొంత కష్టంగా అనిపించినా, ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. కాగా, శ్రద్ధా కపూర్ ఎంపిక చేసుకున్న తదుపరి సినిమా ‘ఈథా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె మరాఠీ లావణి కళాకారిణి విఠాబాయి నారాయణ్‌గాంకర్ పాత్రలో కనిపించనున్నారు. ఇది ఒక బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా. రణదీప్ హుడా, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2026 డిసెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఇదొక ప్రయోగమనే చెప్పాలి. ఈ సినిమా గనక సక్సెస్ సాధిస్తే..ఇలాంటి మరికొన్ని ప్రాజెక్ట్స్‌కి శ్రద్ధా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం.

#Shraddha Kapoor#Sthree 2#Eetha Movie#Bollywood#Bollywood Actress Shraddha Kapoor
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి