ఏపీ

AP : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసు.. ఈడీ ఆకస్మిక సోదాలు

4 నిమిషాల పఠనం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం తెలంగాణ, ఏపీలోని మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం తెలంగాణ, ఏపీలోని మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా? అన్నకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

హైదరాబాద్ పరిధిలోని కాశీమ్ బౌలిలో ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. నగరంలోని పంచవటి కాలనీ, పంజాగుట్ట, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ట్రూ గ్రేడర్ సంస్థతో పాటు అల్వాల్‌లోని వెంకటాపురంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఏపీలోని మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో ఉన్న ఆవాస రిసార్ట్‌లోనూ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది.

అయితే, గ్రూప్ -1 మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి నిధుల కేటాయింపులు, కాంట్రాక్టుల వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. క్యామ్ సైన్ మీడియా సహా ఇతర ప్రైవేట్ సంస్థల ఆర్థిక లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో పాటు వాటి వెనుక మనీలాండరింగ్ జరిగిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ సోదాల్లో భాగంగా లభ్యమైన కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు పూర్తయిన తర్వాత దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.కాగా, వైసీపీ హయాంలో గ్రూప్-1 పరీక్షా పేపర్ మూల్యాంకనం ఏపీపీఎస్సీ కార్యాలయంలో కాకుండా ప్రయివేటు రిసార్టులో చేశారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలో ప్రభుత్వం మారి కూటమి సర్కార్ వచ్చాక ఈ కేసు విచారణకు గాను ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయగా.. తాజాగా ఈడీ రంగప్రవేశం చేసింది.

#Appsc#group-1 exam#enforcement directorate#raids#ysrcp#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి