Kollywood: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్, డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు మరో గొప్ప అవకాశం దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో శ్రీలీల ప్రధాన పాత్రను పోషించనుంది. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా శ్రీలీల ఎంట్రీతో ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసి శ్రీలీల నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా 'ధర్మన్' అనే టైటిల్ తో రూపొందుతోన్న సంగతి తెలీందే. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా శ్రీలీలను ఆహ్వానిస్తూ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. 'షీ హ్యాస్ ది స్పార్క్.. షీ హ్యాస్ ది పటాకా' అంటూ ఆమె పాత్రపై ఆసక్తిని పెంచారు.
ఈ సినిమాలో ఇప్పటికే రామ్ పోతినేని, నయనతార, సిమ్రన్, రాశీ ఖన్నా వంటి ప్రముఖ నటీమణులు భాగమయ్యారు. యోగిబాబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, శ్రీలీల ఎవరికి జోడీగా కనిపించనుంది? ఆమె పాత్ర కథలో ఎంత కీలకం? అనే విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
శ్రీలీల కెరీర్లో రజినీకాంత్‌తో కలిసి నటించడం మరో ప్రత్యేకమైన అవకాశమనే చెప్పాలి. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి 'ధర్మన్' లాంటి భారీ ప్రాజెక్ట్ మంచి గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రజినీకాంత్ వంటి సూపర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె కెరీర్‌కు ప్లస్ కానుంది. ఇటీవల, జైలర్ 2లో స్పెషల్ సాంగ్‌లో కనిపించిన పూర్ణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
ఒకవైపు రజినీకాంత్ మాస్ ఇమేజ్, మరోవైపు కమల్ హాసన్ నిర్మాణ బాధ్యతలు.. వీటికి తోడు అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇందులో రజినీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. నేరస్థులపై పోరాడే వ్యక్తిగా ఆయన పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే, డెడ్లీ డాక్టర్ అంటూ పిలుస్తున్నారు.
మొత్తానికి 'ధర్మన్' సినిమాలో శ్రీలీల ఎంట్రీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. మరి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి శ్రీలీల ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది? ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతోంది? అన్నది సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.


