విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా మళ్లీ ఏదో ఒక చోట వెలుగుచూస్తునే ఉంది.జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేయడం వలన గతంలో పలువురు బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవలి కాలంలో ర్యాగింగ్ ఘటనలు చాలా అరుదు. తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న వేళ తాజాగా కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
కామారెడ్డి మెడికల్ కాలేజీలో తాజాగా ర్యాగింగ్ కలకలం రేపింది. కొందరు సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధించినట్టు సమాచారం.వారిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 14 మంది సీనియర్లపై కాలేజ్ మేనెజ్మెంట్ చర్యలకు ఉపక్రమించింది.
జూనియర్ విద్యార్థులను వేధించిన 14 మంది సీనియర్లను సస్పెండ్ చేస్తూ కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు.అంతకుముందు ర్యాగింగ్‌పై నేషనల్ మెడికల్ కమిషన్‌కు బాధిత విద్యార్థులు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో స్పందించిన మెడికల్ కమిషన్ సంబంధిత కాలేజీకి అసలు విషయాన్ని ఈ మెయిల్ రూపంలో తెలియజేసినట్టు తెలుస్తోంది. దీనిపై రంగంలోకి దిగిన కామారెడ్డి మెడికల్ కాలేజీ అధికారలుు ముందుగా విచారణ చేపట్టారు.
ర్యాగింగ్ ఘటన నిజమే అని నిర్దారించుకున్నాక 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు.నలుగురు విద్యార్థులను 6 నెలల పాటు, మరో 10 మందిని 4 నెలల పాటు సస్పెండ్ చేసినట్టు తెలిసింది.మరోసారి ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని సీనియర్లను హెచ్చరించినట్టు తెలిసింది. అకడమిక్స్ నుంచి సైతం బయటకు పంపించివేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.


