సినిమా

Tollywood: కింగ్ 100 నుంచి టబు పాత్ర రివీల్.. అదిరిపోయిన గ్లింప్స్!

4 నిమిషాల పఠనం

Tollywood: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కింగ్ 100 నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి సస్పెన్స్‌గా ఉంచిన టబు పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా నాగార్జున, టబు కాంబినేషన్ మరోసారి తెరపైకి రావడం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.

ఈసారి ప్రేమ కాదు.. యుద్ధం!

నాగార్జున, టబు జోడీ అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా', ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన 'ఆవిడా మా ఆవిడే' వంటి సినిమాలు. అప్పట్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జోడీ కలిసి నటిస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈసారి మాత్రం వీరిద్దరి మధ్య ప్రేమకథ ఉండబోవడం లేదనే విషయాన్ని మేకర్స్ ముందుగానే హింట్ ఇచ్చారు. 'ఈసారి ప్రేమ కాదు.. యుద్ధం' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో టబు పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో టబు స్టైలిష్ గా, గంభీరమైన లుక్‌తో కనిపించడం విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా వదిలిన గ్లింప్స్‌లో టబు లుక్ చూస్తుంటే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని అర్థమవుతోంది. కేవలం గ్లామర్ కోసం కాకుండా కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో ఆమె కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది.

నాగార్జున పాత్రతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంటుంది? ఇద్దరి మధ్య పోరు ఎందుకు మొదలవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, టబుతో పాటు పలువురు కీలక నటీనటులు కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నాగార్జున వందో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

#Nagarjuna Akkineni#King 100#Ra.Karthik#Tabu#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి