క్రైమ్

Crime : యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ ముద్రణ.. 6.78 కోట్లు సీజ్

4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో మరో ఘరానా మోసగాళ్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫేక్ కరెన్సీని సొంతంగా ముద్రించి చెలామణి చేసేందుకు సదరు నిందితులు స్కెచ్ వేసినట్టు తెలిసింది. అందుకోసం ఏకంగా యూట్యూబ్‌లో చూసి దొంగనోట్లు ఎలా ముద్రించాలో నైపుణ్యం పొందినట్టు సమాచారం. అందుకోసం ముద్రణ సామగ్రిని సైతం సమకూర్చుకుని భారీ ఎత్తున ఫేక్ కరెన్సీని ముద్రించినట్టు తెలిసింది.

హైదరాబాద్ మహానగరంలో మరో ఘరానా మోసగాళ్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫేక్ కరెన్సీని సొంతంగా ముద్రించి చెలామణి చేసేందుకు సదరు నిందితులు స్కెచ్ వేసినట్టు తెలిసింది. అందుకోసం ఏకంగా యూట్యూబ్‌లో చూసి దొంగనోట్లు ఎలా ముద్రించాలో నైపుణ్యం పొందినట్టు సమాచారం. అందుకోసం ముద్రణ సామగ్రిని సైతం సమకూర్చుకుని భారీ ఎత్తున ఫేక్ కరెన్సీని ముద్రించినట్టు తెలిసింది.విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకివెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుంట్లూరు కేంద్రంగా కొందరు అక్రమార్కులు నకిలీ నోట్లను తయారీ చేసి మార్కెట్లో చెలామణికి వ్యూహ రచన చేశారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లను తయారు చేశారు.రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో కారులో వెళ్తుండగా పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా.. రూ.8 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.

అనంతరం పంపిణీకి సిద్ధంగా ఉంచిన మరో రూ.6.78 కోట్ల నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నోట్ల తయారీని ప్రధాన నిందితుడు కర్ణాకర్ నేర్చుకున్నట్టు తెలిసింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌వోటీ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పెద్దఎత్తున నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు.

అనంతరం ఈ కేసు వివరాలను ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. ఇదిలాఉండగా, నకిలీనోట్లను మార్కెట్లో చెలామణి చేశారా? చేస్తే ఎక్కడెక్కడ చేశారు? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.

#fake currency#making#4 members arrest#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి