Tollywood: ఇప్పుడు మనకున్న గొప్ప రచయితల్లో విజయేంద్రప్రసాద్ గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకి కథలు రాయడం ఒక ఎత్తయితే.. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఆ కథను నడిపించడం మరో ఎత్తు. ఈ విషయంలో ప్రముఖ రచయిత కె. విజయేంద్ర ప్రసాద్ కి ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన నుంచి వచ్చిన కథలు కేవలం వినోదాన్ని మాత్రమే అందించకుండా.. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందుకే ఆయన కథలకు భారతీయ సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఒక సాధారణ ఆలోచనను తీసుకుని, దానికి అసాధారణమైన కథనాన్ని జోడించడం విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేకత. పాత్రల రూపకల్పన, భావోద్వేగాలు, ఊహించని మలుపులు, బలమైన సంఘర్షణలు ఆయన కథల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కథలో ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ఆసక్తిని కొనసాగించడం ఆయన రచనా శైలిలో కనిపించే మరో ప్రత్యేకత. దాన్ని, సన్నివేశాల రూపంలో దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించి ఆకట్టుకుంటున్నాడు రాజమౌళి.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటడంలో కీలక పాత్ర పోషించారని గర్వంగా చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి కథలోని రాజకుటుంబ నేపథ్యం, అన్నదమ్ముల మధ్య సంఘర్షణ, తల్లి సెంటిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అలాగే, ఎన్‌టిర్-రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన కథా ప్రతిభను చాటుకున్నారు. చారిత్రక వ్యక్తుల నేపథ్యాన్ని తీసుకుని, కల్పిత కథతో అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించారు. ఇక హిందీలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా వచ్చిన భజరంగీ భాయిజాన్ సినిమాకు కూడా ఆయన అందించిన కథ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రచయిత విజయేంద్ర ప్రసాద్ కథల్లో ఎమోషన్‌కు ప్రధాన్యత ఉంటుంది. యాక్షన్ ఉన్నా, ఫాంటసీ ఉన్నా, చారిత్రక నేపథ్యం ఉన్నా.. వాటన్నింటినీ కలిపే బలమైన భావోద్వేగం ఉంటుంది. అందుకే ఆయన కథలు భాషా పరిమితులను దాటి ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. ముఖ్యంగా ఒక కథను ప్రేక్షకులకు చెప్పే విధానం, చిన్న విషయాన్ని కూడా పెద్ద ఆసక్తికరమైన మలుపుగా మార్చే నైపుణ్యం ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.


