క్రైమ్

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో పట్టపగలే చోరీ.. రూ.30లక్షల విలువైన వెంటిలేటర్లు అపహరణ

5 నిమిషాల పఠనం

RIMS: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ లో చోరీ జరిగింది. పట్టపగలే దుండగులు బరితెగించారు. వెంటిలేటర్లు ఎత్తుకెళ్లారు. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే 4 వెంటిలేటర్స్ ను ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు.

వరుస వివాదాల్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి

గతంలో ICUలో ఎలుకలు

ఇటీవల శిశువుల వార్డులో అగ్నిప్రమాదం

తాజాగా పట్టపగలే చోరీ

30లక్షల విలువైన 4 వెంటిలేటర్లను ఎత్తుకెళ్లిన దొంగలు

RICU వార్డులోని వెంటిలేటర్లు అపహరణ

సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

గోప్యంగా ఉంచిన రిమ్స్ యాజమాన్యం

RIMS: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ లో చోరీ జరిగింది. పట్టపగలే దొంగలు బరితెగించారు. ఏకంగా 4 వెంటిలేటర్లు ఎత్తుకెళ్లారు. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే 4 వెంటిలేటర్స్ ను ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ వెంటిలేటర్ల విలువ రూ.30లక్షలు.

పట్టపగలే కళ్లముందే దర్జాగా తీసుకెళ్లిపోయారు

గత నెల 30న రిమ్స్ రెండో అంతస్తులోని ఛాతీ వార్డు RICU విభాగంలో ఈ ఘటన జరిగింది. ఆర్‌ఐసీయూ నుంచి రెండు, టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లను తీసుకెళ్లిపోయారు. ఇద్దరు వ్యక్తులు నాలుగు వెంటిలేటర్స్ ని దర్జాగా తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రిమ్స్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దొంగలకు కలిసి వస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం

ఈ చోరీ ఘటనతో రిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వ్యవహారం మరోసారి దుమారం రేపింది. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం దొంగలకు కలిసి వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. బయటి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కళ్లముందే ఎంతో దర్జాగా వెంటిలేటర్లు ఎత్తుకెళ్లిపోయారంటే అక్కడ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా భయమన్నది లేకుండా చోరీకి పాల్పడ్డారు. కళ్ల ముందే వెంటిలేటర్లను పీక్కుపోతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

వరుస వివాదాల్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. గతంలో ICUలో ఎలుకలు ఆ తర్వాత అగ్నిప్రమాదం ఘటనలు కలకలం రేపాయి. సెప్టెంబర్ నెలలో నవజాత శిశువుల సంరక్షణ వార్డులో అగ్నిప్రమాద ఘటన తర్వాత మేలుకోవాల్సిన రిమ్స్ యాజమాన్యం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వెంటిలేటర్ల చోరీ ఇందుకు నిలువెత్తు నిదర్శనం. రిమ్స్ లో భద్రతా వైఫల్యానికి ఈ ఘటన అద్దం పడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. ఆ తర్వాత లోపల మూడింతల భద్రత ఉంటుంది. ఇదంతా దాటుకుని లోపలికి వెళ్లిన దుండగులు.. ఎంచక్కా వెంటిలేటర్లను బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయారు.

చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ తరహా ఘటనలు ఇలానే జరుగుతుంటే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

#RIMS#Robbery#Stolen#Adilabad#Ventilators#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి