ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మురసు తుపాను నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. తుపాన్ తీరం దాటడంతో చాలా చోట్ల వర్షాలు తగ్గాయని జిల్లా కలెక్టర్లు వివరించడంతో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమయ్యారు.వర్షప్రభావం ఇంకా కొన్ని మండలాల్లో ఉన్నందున అవి మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహించేందుకు రెడీగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎన్నికల సామగ్రిని తరలించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జిల్లా కలెక్టర్లు వివరించడంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ వాయిదా వేశారు.
ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు ఎదురైతే కలెక్టర్ల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టంచేశారు.పలు జిల్లాల్లోని కొన్ని మండలాలు మినహా ఏపీలో ఎన్నికల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ యథావిధిగా నిర్వహించే చాన్సెస్ ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న గుంటూరు జిల్లాలోని కాకుమాను, పెదనందిపాడు, ఫిరంగిపురం మండలాల్లో మాత్రం పోలింగ్ వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఏపీలో మొత్తం జడ్పీటీసీ (ZPTC) స్థానాలు 659 ఉండగా, ఎంపీటీసీ (MPTC) స్థానాలు 9,829 ఉన్నాయి. ఈ స్థానాల్లో ఇప్పటికే 77 జెడ్పీటీసీ స్థానాలు, 1,985 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.తుపాన్ ప్రభావంతో ఈ ఎన్నిలకు పోలింగ్ వాయిదా పడగా.. రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇదిలాఉండగా, ఏపీలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. అధికార టీడీపీ-జనసేన-బీజేపీ (NDA) కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో 12 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, ఒక చోట మాత్రమే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ విజయం సాధించింది. అదేవిధంగా మొత్తం 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఛైర్పర్సన్ స్థానాలలో 84 చోట్ల కూటమి అభ్యర్థులు, 3 చోట్ల వైఎస్సార్సీపీ క్యాండిడేట్స్ విజయం సాధించారు.


