సినిమా

Naga Vamshi: ‘ఓం: చాప్టర్ 1’ తో మళ్ళీ సితార లాభాల్లోకి వచ్చేనా?

4 నిమిషాల పఠనం

Naga Vamshi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓం: చాప్టర్ 1’పై టాలీవుడ్‌లోనూ అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ‘ఓం: చాప్టర్ 1’ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

Naga Vamshi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓం: చాప్టర్ 1’పై టాలీవుడ్‌లోనూ అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ‘ఓం: చాప్టర్ 1’ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఒకవైపు సొంత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు ఇతర భాషల్లోని ఆసక్తికరమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ముందుంటోంది. అయితే, ఈ మధ్య నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు ఆఇంచినంతగా లాభాలను తేలేకపోయాయి. ఇప్పుడు ధనుష్ ‘ఓం: చాప్టర్ 1’ తెలుగు పంపిణీ హక్కులను దక్కించుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతోనైనా లాభాలు దక్కుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

కోలీవుడ్ స్టార్ ధనుష్, మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణ:

ఈ సినిమాలో ధనుష్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి తెరపై కనిపించనుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక సాయిపల్లవి, శ్రీలీల, నజీరుద్దీన్ షా వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో భాగమవడం సినిమాకి కలిసొచ్చే అంశాలు. ముఖ్యంగా, ఫిదా బ్యూటీ సాయిపల్లవి పోలీస్ అధికారిణి నిత్యారెడ్డి పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ఆమె పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియో కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

‘ఓం: చాప్టర్ 1 – ఉదిరం: ది బ్లడ్ వుడ్’ చిత్రాన్ని నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మొదట అక్టోబర్ 16న విడుదల చేయాలని భావించినప్పటికీ, రజనీకాంత్ ‘జైలర్ 2’ విడుదల నేపథ్యంలో వాయిదా వేశారు. కాగా, ‘అమరన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

#Naga Vamshi#Dhanush#Mammutty#Mm Chapter-1#Sai Pallavi#Sreeleela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి