సినిమా

Sai Pallavi: సాయి పల్లవి మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా?

5 నిమిషాల పఠనం

Sai Pallavi: నేచురల్ పర్ఫార్మెన్స్‌తో పాటు, అద్భుతమైన అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సాయి పల్లవి.. ఇప్పుడు పదే పదే తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నేచురల్ బ్యూటీ.. బయట మాట్లాడే మాటల వల్ల మాత్రం వివాదాలను ఎదుర్కొంటున్నారు.

Sai Pallavi: నేచురల్ పర్ఫార్మెన్స్‌తో పాటు, అద్భుతమైన అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సాయి పల్లవి.. ఇప్పుడు పదే పదే తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నేచురల్ బ్యూటీ.. బయట మాట్లాడే మాటల వల్ల మాత్రం వివాదాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, ఈ మధ్య బాలీవుడ్ మూవీ 'రామాయణ' ప్రమోషన్ల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

అయితే, సాయి పల్లవి ఉద్దేశం ఒకటైతే.. జనాలు అర్థం చేసుకుంటున్నది మరొకటా? ఆమె మాటలను నిజంగానే తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? లేక మాటలు చెప్పే విధానంలోనే ఏదైనా సమస్య ఉందా? అనే ఇప్పుడు అంతటా చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాలో సీత పాత్రలో నటించింది సాయి పల్లవి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కార్యక్రమంలో రావణుడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి.

రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదని, ప్రతి మనిషిలోనూ మంచి, చెడు లక్షణాలు ఉంటాయని, మనలోని చెడు లక్షణాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని సాయి పల్లవి మాట్లాడింది. అయితే, ఈ వ్యాఖ్యల్లోని తాత్విక కోణాన్ని కొందరు అర్థం చేసుకోగా, మరికొందరు మాత్రం రావణుడిని సమర్థిస్తున్నట్లుగా సాయి పల్లవి మాటలను అర్థంచేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి సాయి పల్లవిపై విమర్శలు మొదలయ్యాయి.

గతంలోనూ ఇలాంటి వివాదాలతో ఇబ్బంది పడ్డ సాయి పల్లవి!

సాయి పల్లవికి ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు. 2022లో 'విరాటపర్వం' సినిమా ప్రమోషన్ల సమయంలో కశ్మీరీ పండిట్ల అంశం, మూకదాడుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ సమయంలో కూడా ఆమె మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని విమర్శించారు. దీనిపై స్పందించిన సాయి పల్లవి.. తాను ఏ రాజకీయ సిద్ధాంతానికీ మద్దతు ఇవ్వలేదని, మతం పేరుతో జరిగే హింసను మాత్రమే వ్యతిరేకించానని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

నా భావాలను సరిగ్గా చెప్పలేకపోతున్నా!

తాజాగా తన మాటల విషయంలో సాయి పల్లవి ఆత్మపరిశీలన చేసుకుంది. నా మనసులో ఉన్న భావాలను ఎదుటివారికి స్పష్టంగా వ్యక్తపరచడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాను అంటూ ఒప్పుకుంది. నా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది, ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాను అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా, సినిమాలలో ఎంతో డీసెంట్ రోల్స్ చేస్తున్న సాయి పల్లవి..ఇలాంటి వివాదాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలవడం మాత్రం కాస్త ఇబ్బందే.

#Sai Pallavi#Ramayana#Nithish Tiwari#Ranbeerkapoor#Yash
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి