తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారి

2 నిమిషాల పఠనం

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో అవినీతి ప్రభుత్వ అధికారి పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి రమేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

ACB: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో అవినీతి ప్రభుత్వ అధికారి పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి రమేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రమేష్ ను పట్టుకున్నారు. లంచం గురించి సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు మండల వ్యవసాయ కార్యాలయంలో మెరుపు దాడి చేశారు. ఎంఏవో రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సదాశివపేట పట్టణంలో ఓ ఎరువుల దుకాణం లైసెన్స్‌కు సంబంధించి వ్యవసాయ అధికారి రమేష్.. వ్యాపారిని రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు గత నెలలో రూ.10 వేలు చెల్లించాడు. మిగతా రూ.20 వేలు మంగళవారం రమేష్‌ కు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేసి రెడ్​ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యవసాయ అధికారి రమేష్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు జరుపుతున్నారు. లంచం తీసుకుంటూ వ్యవసాయ అధికారి ఏసీబీకి దొరికిపోయిన వ్యవహారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో కలకలం రేపింది.

#ACB#Sanga Reddy#Sadasivpet#Mandal Agriculture Officer#Ramesh#Bribe#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి