విద్యార్థులకు నవంబర్ నెల అత్యంత పండుగ సందడిని, ఆనందాన్ని మోసుకొస్తోంది. ఈ నెలలో వరుసగా రానున్న దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్, ఛత్ పూజ, గురునానక్ జయంతి పండగలతో పాటు సాధారణ ఆదివారాలు కూడా కలిసి రావడంతో వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలకు 8 నుంచి గరిష్ఠంగా 13 రోజుల వరకు సెలవులు లభించే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలన్నింటికీ ఈ సెలవుల సంఖ్య ఒకే విధంగా ఉండదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖలు జారీ చేసే అధికారిక ఉత్తర్వుల ఆధారంగానే పండగ సెలవుల క్యాలెండర్ మారుతుందని అధికారులు వెల్లడించారు.
నవంబర్ నెలలో రానున్న ప్రధాన పండుగల పట్టికను పరిశీలిస్తే.. నవంబర్ 8న దీపావళి పండుగ జరగనుండగా, మరుసటి రోజు నవంబర్ 9న గోవర్ధన్ పూజ జరగనుంది. అలాగే నవంబర్ 11న భాయ్ దూజ్, నవంబర్ 15న ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఛత్ పూజ, నవంబర్ 24న గురునానక్ జయంతి (గురుపురబ్) రానున్నాయి. ఈ ప్రధాన పండగల సందర్భాలను పురస్కరించుకుని ఆయా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
పండగల సెలవుల తేదీలతో పాటు నవంబర్ నెలలోని సాధారణ ఆదివారాలను కూడా జోడిస్తే కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో విద్యార్థులకు మొత్తం 8 నుంచి 13రోజుల వరకు పాఠశాలల నుంచి విరామం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని పండగలు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా స్థానిక ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల, మరికొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు యథావిధిగా పనిచేసే అవకాశం ఉందనే విషయాన్ని గ్రహించాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తమ తమ పాఠశాలల యాజమాన్యాలు జారీ చేసే అధికారిక సెలవుల ప్రకటనలను మాత్రమే ప్రమాణికంగా తీసుకోవాలి. తెలంగాణ, ఏపీ రాష్ట్ర విద్యాశాఖలు విడుదల చేసే స్థానిక సెలవుల జాబితా (Academic Calendar) ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు లేదా ఇతర కుటుంబ శుభకార్యాల ప్లానింగ్ చేసుకునే ముందు స్కూల్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించి స్పష్టత తెచ్చుకోవడం మంచిది.


