తెలంగాణ

హైదరాబాద్‌లో 36గంటల పాటు నీటి సరఫరాకు బ్రేక్.. జలమండలి ప్రకటన!

4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలోని పలు కీలక ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (HMWS&SB - జలమండలి) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. నగరానికి తాగునీటిని అందించే వందేళ్ల పురాతనమైన గండిపేట (ఉస్మాన్‌సాగర్) కాండ్యూట్ మార్గంలో తీవ్ర లీకేజీలను గుర్తించిన అధికారులు, వాటికి అత్యవసర మరమ్మతులు చేపడుతున్నారు.

 హైదరాబాద్ మహానగరంలోని పలు కీలక ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (HMWS&SB - జలమండలి) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. నగరానికి తాగునీటిని అందించే వందేళ్ల పురాతనమైన గండిపేట (ఉస్మాన్‌సాగర్) కాండ్యూట్ మార్గంలో తీవ్ర లీకేజీలను గుర్తించిన అధికారులు, వాటికి అత్యవసర మరమ్మతులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3వ తేదీ మంగళవారం(నేడు) ఉదయం 6:00 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ బుధవారం సాయంత్రం 6:00 గంటల వరకు (మొత్తం 36 గంటల పాటు) పలు ప్రధాన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

 ప్రభావిత ప్రాంతాల ప్రజలు తగినంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. జలమండలి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి ప్రతిరోజూ వివిధ జలవనరుల నుంచి 560 మిలియన్ గ్యాలన్ల (MGD) తాగునీరు సరఫరా అవుతోంది. ఇందులో ఉస్మాన్‌సాగర్ నుంచి వచ్చే 20 ఎంజీడీల సామర్థ్యం కలిగిన రాతి నిర్మాణపు కాండ్యూట్ మార్గం అత్యంత ప్రాధాన్యమైనది. సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ పరిధిలోని కాండ్యూట్‌పై లీకేజీలను అరికట్టి నీటి వృథాను నిరోధించేందుకు ఈ 36 గంటల షట్‌డౌన్‌ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

 నీటి సరఫరా నిలిచిపోయే ప్రభావిత ప్రాంతాల వివరాలు

గోషామహల్, కార్వాన్ సర్కిళ్లు (డివిజన్-13): రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ. గోల్కొండ జోన్ (డివిజన్-14): చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్. ఇతర ప్రాంతాలు: కవాడిగూడ పరిధిలోని గాంధీనగర్ వార్డులు, దోమలగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు.

 ఈ 36 గంటల అంతరాయం కేవలం గండిపేట కాండ్యూట్‌పై ఆధారపడిన నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమని జలమండలి స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి, సింగూరు-మంజీరా జలవనరుల ద్వారా నగరంలోని మిగిలిన భాగాలకు అందించే నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకమూ ఉండదని తెలిపింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకుని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి సూచించింది.

#HyderabadWaterCut2026#HMWSBNotice#HyderabadWaterSupplyInterrupt#GandipetConduitRepair#HydNewsTelugu#TelanganaNewsTelugu#JubileeHillsWaterCut#NampallyWate
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి