సినిమా

Bollywood: "క్రాంతికి వస్తున్నాం" హిందీ రీమేక్..అసలు సౌండే లేదు!

4 నిమిషాల పఠనం

Bollywood: టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. పోకిరి, విక్రమార్కుడు లాంటి సినిమాలు దీనికి ఉదాహరణ. ముఖ్యంగా తెలుగు సినిమాలకు హిందీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో బాలీవుడ్ మేకర్స్ కూడా మన సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఒక సినిమా రీమేక్ హక్కులు కొనడం వేరు

Bollywood: టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. పోకిరి, విక్రమార్కుడు లాంటి సినిమాలు దీనికి ఉదాహరణ. ముఖ్యంగా తెలుగు సినిమాలకు హిందీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో బాలీవుడ్ మేకర్స్ కూడా మన సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఒక సినిమా రీమేక్ హక్కులు కొనడం వేరు.. దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే స్థాయిలో ప్రచారం చేయడం వేరు. ఇప్పుడు ఇదే చర్చకు కారణమవుతోంది సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్.

తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా, హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ వసూళ్లు సాధించింది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దిల్ రాజుకి మంచి లాభాలను తెచ్చింది. దీంతో ఈ కథను హిందీలో నిర్మించాలని నిర్మాత దిల్ రాజు రెడీ అయ్యాడు. కానీ, హిందీ వెర్షన్ విషయంలో మొదట్లో వినిపించిన హడావుడి ఇప్పుడు కనిపించడం లేదు.

అక్షయ్ కుమార్-అనీస్ బాజ్మీ కాంబో కష్టమేనా?

ఈ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ నటిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలను అనీస్ బాజ్మీ చేపట్టారు. ఇక తెలుగు వెర్షన్‌లో ఐశ్వర్య రాజేశ్ చేసిన భార్య పాత్రను విద్యాబాలన్, మీనాక్షి చౌదరి చేసిన మాజీ ప్రేయసి పాత్రను రాశీ ఖన్నా పోషిస్తున్నారు. దీనికి, సంబందించిన పోస్టర్ కూడా వదిలారు. విజయ్ రాజ్, జాకీర్ హుస్సేన్, సయాజీ షిండే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమా మక్కీకి మక్కీగా తెలుగు సినిమాకు రీమేక్ కాదని అనీస్ బాజ్మీ స్పష్టం చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం' కథలోని ప్రధాన పాయింట్‌కు దగ్గరగా ఉంటుందని, హిందీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కథను మార్పులు చేసి రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, అక్షయ్-అనీస్ బాజ్మీ కాంబోపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఎందుకనో, నిర్మాత దిల్ రాజు కూడా సల్మాన్ సినిమా మీద పెట్టినంతగా ఈ సినిమాపై ఫోకస్ చెయడం లేదు.

#Akshay Kumar#Dil Raju#Vidya Balan#Rasiikhanna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి