తెలంగాణ

HYD : జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు

4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని విశ్వసనీయ సమాచారం అందడంతో ఇవాళ ఉదయం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు.

రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని విశ్వసనీయ సమాచారం అందడంతో ఇవాళ ఉదయం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు.

జీహెచ్‌ఎంసీ (GHMC) అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. నగరంలోని ఎల్‌బీనగర్‌లో ఆయన ఉంటున్న నివాసంతో పాటు సూర్యాపేటలో సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న ఆయన స్వగృహం, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపడుతున్నాయి.

ఏడీ యాదగిరికి చెందిన స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్రమాస్తుల గురించి విశ్వసనీయ సమాచారం రావడంతోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. యాదగిరి ఇళ్లతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లపైనా ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలాఉండగా, ఏడీ యాదగిరి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని కింది స్థాయి ఉద్యోగులు సైతం ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూనే రూ.లక్షల్లో లంచాలు తీసుకుంటారని ఆయనపై భారీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి.ఇటీవల ఓ పని మీద రూ.లక్షల్లో లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. సదరు ఏడీ యాదగిరి వేధింపులు తాళలేక ఆయన బాధితులే ఏసీబీకి సమాచారం అందించారని టాక్ వినిపిస్తోంది.

ఈ తనిఖీల్లో పెద్దఎత్తున అక్రమాస్తులు గుర్తించినట్టు సమాచారం. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలించే పనిలో ఉన్న అధికారులు..ఈ అక్రమాస్తులకు సంబంధించిన వివరాలు ఏడీ యాదగిరిని అడిగి తెలుసుకోనున్నట్టు తెలిసింది.అనంతరం మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తారని సమాచారం. కాగా, యాదగిరి అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. వందల కోట్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

#ghmc assistant director#ACB raids#hyderabad#bribe#illegal income#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి