జాతీయం

National : బోర్డర్‌లో అలజడి.. ముగ్గురు ఆర్మీ జవాన్లపై మూక దాడి!

4 నిమిషాల పఠనం

నిరంతరం దేశ సరిహద్దుల్లో పహారా కాసే భద్రతా బలగాలపై ఓ మూక దాడి చేయడం సంచలనంగా మారింది. కొందరు ప్లాన్ ప్రకారమే ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహానాన్ని అడ్డుకుని కర్రలతో దాడులకు పాల్పడినట్టు తెలిసింది. బంగ్లాదేశ్, చైనాకు సమీపంలో ఉండే త్రిపుర రాష్ట్రంలోని సిపాహిజాల జిల్లా బోక్సానగర్ పరిధిలోని ఆశా బారి సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నిరంతరం దేశ సరిహద్దుల్లో పహారా కాసే భద్రతా బలగాలపై ఓ మూక దాడి చేయడం సంచలనంగా మారింది. కొందరు ప్లాన్ ప్రకారమే ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహానాన్ని అడ్డుకుని కర్రలతో దాడులకు పాల్పడినట్టు తెలిసింది. బంగ్లాదేశ్, చైనాకు సమీపంలో ఉండే త్రిపుర రాష్ట్రంలోని సిపాహిజాల జిల్లా బోక్సానగర్ పరిధిలోని ఆశా బారి సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లపై దాడులకు పాల్పడిన వారిని స్మగ్లర్లుగా గుర్తించారు. నిందితులు కర్రలు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో గస్తీ కాస్తున్న బలగాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఓ వైపు దాడికి పాల్పడుతూనే నిందితులు జవాన్ల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి అక్రమ చొరబాటుదారులు సరిహద్దులు దాడుతుండటంతో పాటు మాదకద్రవ్యాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు బలగాలు గుర్తించాయి. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు స్మగ్లర్లను పట్టుకునేందుకు బలగాలు ప్రయత్నించగా.. స్థానికుల సాయంతో వారు దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై త్రిపుర సీఎం మాణిక్ సాహా స్పందించడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దేశాన్ని రక్షించే భద్రతా దళాలపై హింసాత్మక దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ దాడి ఘటనతో ఆశాబారి గ్రామ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్మీ, పోలీసు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

#tripura border#army jawans#smugglers#national#attacked#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి