క్రైమ్

Crime : ఆస్తి కోసం కిరాతకం.. తమ్ముడి భార్యను హతమార్చిన అన్నలు

4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత తమ్ముడి భార్యను అన్నలు కిరాతకంగా హతమార్చారు.ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ్ముడు ఊర్లో లేని సమయంలో అత్యంత కిరాతకంగా మరదలిని హతమార్చడంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత తమ్ముడి భార్యను అన్నలు కిరాతకంగా హతమార్చారు.ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ్ముడు ఊర్లో లేని సమయంలో అత్యంత కిరాతకంగా మరదలిని హతమార్చడంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చింతల్‌తండాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. 12 ఏళ్ల కిందట బలరాం అనే వ్యక్తితో సునీత(28)కు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బలరాంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఏడాది క్రితం పంచాయితీ పెట్టి భార్య సునీత పేరిట ఎకరంన్నర భూమిని పట్టా చేయించారు. ఇది బలరాం అన్నలు పాండునాయక్, మన్యానాయక్‌కు నచ్చలేదు. ఎలాగైనా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశారు.

ఈ క్రమంలోనే భార్యాభర్తలను కాపురం చేయనివ్వకుండా తన తమ్ముడు బలరాంను తరచూ తమ వెంట హైదరాబాద్ తీసుకెళ్లేవారు అన్నలు. ఈ విషయం తెలిసి సునీత విసుగుచెందింది. అనంతరం తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, తల్లిదండ్రులు నచ్చజెప్పి, నెల క్రితం చింతల్‌తండాలో ఇల్లు నిర్మించి ఇవ్వగా భార్యాభర్తలు అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే, బలరాం అన్నలు ఆమె ఇంటికి వెళ్లి తన పేరిట రాయించుకున్న భూమిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయసాగారు. లేదంటే ఇల్లు వదిలి వెళ్లాలని,చంపుతామని బెదిరించారు.

నవంబర్ 2న మధ్యాహ్నం ఇద్దరు అన్నలు, పాండు భార్య పార్వతి, మామ మాణిఖ్యనాయక్ కలిసి సునీతను దారుణంగా చంపేశారు. గొంతుకు పంచె కట్టి వారి ఇంటికి లాక్కెళ్లారు. అనంతరం కత్తులతో గొంతు కోసి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘాతుకం జరుగుతున్న సమయంలో సునీత భర్త బలరాం హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలిసింది. కాగా, సునీత తండ్రి వాల్యానాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

#murder#mahaboobnagar#assest issue#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి