Kollywood: కోలీవుడ్ హాట్ కాంబో శింబు, నయనతార మళ్లీ కలిసి నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ప్రాజెక్ట్ కి సంబందించి ఇంకా అధికారికంగా ఎలాంటి కన్‌ఫర్మేషన్ లేదు. ఒకవేళ, నయన్-శింబుల సినిమా అఫీషియల్‌గా ప్రకటిస్తే మాత్రం పదేళ్ళ ఈ హాట్ కాంబోను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూడొచ్చు.
తాజా సమాచారం మేరకు, ‘డ్యూడ్’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తీశ్వరన్ తన నెక్స్ట్ మూవీని హీరో శింబుతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకునేందుకు సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గతంలో శింబు, నయనతార కలిసి రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ చిత్రాలే, 2006లో వచ్చిన ‘వల్లవన్’ (తెలుగులో వల్లభ) పేరుతో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. దీని, తర్వాత 2016లో విడుదలైన ‘ఇదు నమ్మ ఆళు’ మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ రెండు సినిమాల్లో శింబు-నయన్‌ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులని ఎంతగానో ఆకర్షించింది.
మళ్ళీ, దాదాపు పదేళ్ళకి మరోసారి ఈ జంట తెరపై కనిపించబోతోందనే వార్త అభిమానుల్లో రెట్టింపు స్థాయిలో ఆసక్తి పెంచుతోంది. కాగా, ఈ సినిమాలో నయన్-శింబులిద్దరు పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారట. అయితే కథ, ఇతర నటీనటులు, సినిమా టైటిల్‌కు సంబంధించి ఇంకా మేకర్స్ నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం, నయన్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన భారీ ప్రాజెక్ట్‌ను చేస్తోంది. అలాగే, మూకుత్తి అమ్మన్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


