సినిమా

Tollywood: పవన్-దిల్ రాజుల ప్రాజెక్ట్ ఓకే గానీ, ఆ రెండే మైనస్!

4 నిమిషాల పఠనం

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో ఓజీ సాధించిన సక్సెస్, కలెక్షన్స్ ఇండస్ట్రీ వర్గాలను షాకయ్యేలా చేశాయి. పవర్ స్టార్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు భారీగా ఉంటాయి. వరుసగా సినిమాలు ఫాలైనా కూడా, కొత్త సినిమాకి మాత్రం అసలు ఆ ప్రభావమే కనిపించదు. ఇక, నిర్మాత దిల్ రాజుకు కూడా సినిమాల విషయంలో మంచి జడ్జిమెంట్ ఉంది.

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో ఓజీ సాధించిన సక్సెస్, కలెక్షన్స్ ఇండస్ట్రీ వర్గాలను షాకయ్యేలా చేశాయి. పవర్ స్టార్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు భారీగా ఉంటాయి. వరుసగా సినిమాలు ఫాలైనా కూడా, కొత్త సినిమాకి మాత్రం అసలు ఆ ప్రభావమే కనిపించదు. ఇక, నిర్మాత దిల్ రాజుకు కూడా సినిమాల విషయంలో మంచి జడ్జిమెంట్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ అంటే అభిమానుల్లో ఆసక్తి పెరగడం సహజం. అయితే ఈ ప్రాజెక్ట్‌పై పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ, రెండు అంశాలు మాత్రం మైనస్‌లుగా మారే అవకాశం కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్-దిల్ రాజుల ప్రాజెక్ట్ విషయంలో ప్రధానంగా ఇబ్బందులు తెచ్చే సమస్య పవన్ కళ్యాణ్ డేట్స్. ప్రస్తుతం, ఆయన రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా ఏ సినిమాకి ఎప్పుడు డేట్స్ ఇవ్వగలరో తెలియని పరిస్థితి. అంతేకాకుండా కొత్త సినిమాల విషయంలోనూ అంత త్వరగా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు సినిమా పట్టాలెక్కాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు.

"వకీల్ సాబ్" కాంబోకి క్రేజ్ ఉంది గానీ!

గతంలో దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఆల్రెడీ, దిల్ రాజు హిందీలో సల్మాన్ ఖాన్-నయనతారలతో ఓ సినిమాను చేస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకుడు. అలాగే, దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమాను నిర్మిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ-కీర్తి సురేష్‌లతో రౌడీ జనార్ధన చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్‌గానూ రామాయణ, మైసా, వృషకర్మ చిత్రాల పంపిణీ హక్కులను దక్కించుకున్నాడు. మరి, పవన్ కళ్యాణ్ సినిమాకి దర్శకుడెవరు..అన్నది ఒకటి సస్పెన్స్‌గా ఉంది. కర్ణుడు అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడట దిల్ రాజు. మరి, పవన్ కళ్యాణ్ కోర్ట్‌లో ఉన్న బాల్ దిల్ రాజు చేతికి ఎప్పుడు వస్తుందో చూడాలి.

#Pawan Kalyan#Dil Raju#Tollywood#Dil Raju New Project With Pawan Kalyan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి