ఏపీ

Ap : మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై కేసు..

4 నిమిషాల పఠనం

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు.

పులివెందులలోని స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద రిటర్నింగ్ అధికారి ఆఫీసు ఎదుట చోటు చేసుకున్న రాజకీయ నిరసనలు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ ఘటనలో వైఎస్ జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పైనా కేసు నమోదు చేసినట్టు తెలిసింది.

ఇదిలాఉండగా, పులివెందులలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తమ ఏజెంట్లను పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, వారు లేకుండానే పోలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ జగన్ నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేయడంతో పోలింగ్‌కు దారులు క్లియర్ అయ్యాయి.

ఇదిలాఉండగా, పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని వైసీపీ తరఫున పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల మున్సిపాలిటీలో అక్రమాలు జరిగాయని, అక్కడ మరల రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల హైకోర్టులో దాఖలు చేయగా.. న్యాయస్థానం ఆ పిటిషన్లను డిస్మిస్ చేసింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆపలేమని, షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతులు మంజూరు చేయడంతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగించారు.

#former cm jagan mohan reddy#Andrapradesh#Case filed#pulivendula municipal polling#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి