Tollywood: నార్త్ హీరోయిన్స్‌కి అవకాశాలివ్వడమే తప్పా? అవును..తాజాగా బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ చూస్తుంటే..అసలు మనవాళ్ళకి కాస్తైనా ఆలోచన ఉండాలనిపిస్తోంది. పట్టుపట్టి, పనిగట్టుకొని మరీ తీసుకొచ్చి ఇక్కడ అవకాశాలిచ్చి..స్టార్ హీరోయిన్స్‌ని చేస్తే..వాళ్ళే తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ మీద తెలుగు హీరోల మీద దర్శకుల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాధిక ఆప్టే ఏమన్నదంటే:
రక్త చరిత్ర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రాధిక ఆప్టే, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో సెకండ్ లీడ్‌గా నటించింది. అయితే, ఈ సినిమాలో తన పాత్ర గురించి అక్క సిరీస్ ప్రమోషన్స్‌లో మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో, తన బంధువుతోనే పెళ్లి చేయడం, ఎక్కువ వయసున్న వారితో నటించమనడం..సినిమా మధ్యలో పాత్రను చంపేయడం నచ్చలేదన్నట్టుగా చెప్పుకొచ్చింది.
ఇలా, ఇప్పుడు మాట్లాడటం ఎందుకు. కథ, అందులో పాత్ర చెప్పినప్పుడు తెలుస్తుంది కదా. అప్పుడెందుకు ఒప్పుకున్నావు. కథ-పాత్ర, నీకంటే వయసులో ఎక్కువ ఉన్న హీరోతో నటించడం, క్యారెక్టర్ మధ్యలోనే చనిపోతుందన్న విషయం తెలిసే ప్రాజెక్ట్‌కి సైన్ చేశావు కదా. ఇక్కడ అవకాశం వస్తే చాలని అప్పుడనుకొని..ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదని అందరినీ తప్పు పట్టే విధంగా మాట్లాడటం..తెలుగు ఇండస్ట్రీని, మేకర్స్‌ని, హీరోలని అవమానించినట్టే కదా.
ఇదే, ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ మండిపడుతూ రాధిక ఆప్టేను ఏకిపారేస్తున్నారు. గతంలో, తాప్సీ కూడా అంతే. తన బొడ్డు మీద కొబ్బరికాయలు వేయడం నచ్చలేదని..అసలు అలా ఎందుకు చేయాలంటూ ఫైర్ అయింది. ఆ సినిమా ఝుమ్మంది నాదం. ఆ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. అప్పట్లో, తాప్సీని కూడా తెలుగు ఆడియన్స్ ఇలాగే రివర్స్‌లో ఏసుకున్నారు. పూజా హెగ్డే కూడా తెలుగు ఆడియన్స్ గురించి చాలా చీప్‌గా మాట్లాడింది. ఇక్కడ వాళ్ళకి బొడ్డు, తొడలు చూపిస్తే చాలనట్టుగా కామెంట్స్ చేసి బుక్కైంది. ఇప్పుడు రాధిక మాట్లాడటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. మరి, ఇకనుంచైనా మన మేకర్స్ నార్త్ వాళ్ళను పక్కన పెట్టి..మన తెలుగమ్మాయిలకి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.


