సినిమా

Tollywood: ఆకాష్ పూరికి బయట నిర్మాతలు కూడా లేరా.రారా!

4 నిమిషాల పఠనం

Tollywood: టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, పాపులారిటీని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న యంగ్ హీరో ఆకాష్ పూరి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ, హీరోగా మాత్రం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోలేకపోయాడు. ఇండస్ట్రీకొచ్చి చాలా ఏళ్ళవుతున్నా..ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు.

Tollywood: టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, పాపులారిటీని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న యంగ్ హీరో ఆకాష్ పూరి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ, హీరోగా మాత్రం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోలేకపోయాడు. ఇండస్ట్రీకొచ్చి చాలా ఏళ్ళవుతున్నా..ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో ఇప్పుడు ఆకాష్ కెరీర్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు ఆకాష్‌కు బయట నిర్మాతలు కూడా సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

'ఆంధ్రా పోరి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆకాష్.. 'మెహబూబా', 'రొమాంటిక్', 'చోర్ బజార్' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్‌కు ఆశించిన స్థాయిలో కమర్షియల్ బ్రేక్ పడలేదు. ముఖ్యంగా 'రొమాంటిక్' సినిమాతో యూత్‌లో కొంతవరకూ గుర్తింపు వచ్చినప్పటికీ, అది కెరీర్‌ను మలుపు తిప్పే విజయంగా మారలేదు. ఈ సినిమాను ప్రభాస్ కూడా ప్రమోట్ చేశాడు. అయినా, కంటెంట్ బలంగా లేక ఫ్లాప్‌గా మిగిలింది.

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఒక హీరో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే నిర్మాతలు ఆ హీరోతో సినిమా చేయడానికి మొహం చాటేస్తారు. మార్కెట్, బిజినెస్, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆకాష్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మనది, ఫ్యాన్ బేస్డ్ ఇండస్ట్రీ. వాళ్ళను కూడా ఆకట్టుకోని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడవు. ఆకాష్ విషయంలో అదే జరిగింది.

ఒకప్పుడు తండ్రి పూరి జగన్నాధ్ నిర్మాణంలో సినిమాలు చేసిన ఆకాష్, ఇప్పుడు బయట నిర్మాతలతో కూడా సినిమాలు చేసి తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం తప్పనిసరి. మంచి కథలు, కొత్త దర్శకులు, సరైన నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేస్తే ఆకాష్‌కు మంచి అవకాశాలు రావచ్చు. కానీ, ఆ ఛాన్సులు ఆకాష్ వరకూ రావడం లేదట. చాలా గ్యాప్ వచ్చింది. వాస్తవానికి, పూరి బయట హీరోలతో కాకుండా కొడుకు ఆకాష్‌తో గనక సినిమాలు ప్లాన్ చేస్తే..తక్కువ బడ్జెట్‌తో మంచి సినిమాలు చేయొచ్చు. ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంటుంది. కానీ, ఇది కూడా జరగడం లేదు. ఇలా, అయితే ఇప్పుడున్న ఠఫ్ కాంపిటీషన్‌లో ఆకాష్ నిలబడటం అసాధ్యం.

#Tollywood#Akash Puri#Puri Jagannadh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి