తెలంగాణ

వందల కోట్ల విలువైన భూములు.. ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు కేటాయింపు- మంత్రి పొన్నం ప్రభాకర్

3 నిమిషాల పఠనం

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలను ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తోందని ఆయన తెలిపారు.

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలను ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తోందని ఆయన తెలిపారు. మంగళవారం నాంపల్లి గృహకల్ప కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల కోసం ఈ-లాటరీని మంత్రి పొన్నం ప్రారంభించారు. గోశామహల్, చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, హౌసింగ్ ఎండీ గౌతమ్, అధికారులు పాల్గొన్నారు. గతంలో ఉపాధి ఒక దగ్గర ఉంటే.. ఇల్లు మరో చోట ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. దీని వల్ల లబ్దిదారులకు ఇబ్బందులు ఎదురయ్యేవన్నారు. అలాంటి పరిస్థితి రావొద్దని ఉపాధి ఎక్కడ ఉంటే ఇల్లు అక్కడే ఉండాలని నిర్ణయించి లబ్దిదారులకు ఇళ్లు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.

క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి 20 నియోజకవర్గాల్లో స్థలం కోసం అందరూ సహకరించినారు. ఆర్టీసీ స్థలాలు, పోలీస్ స్థలాలు, హౌసింగ్ బోర్డు స్థలాలు.. ప్రభుత్వ స్థలం వందల కోట్ల రూపాయల ఎకరం ఉన్నప్పటికీ గృహ నిర్మాణానికి ఇవ్వాలనుకున్నాం, ఇచ్చాం. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో డ్రా తీసి లబ్దిదారులకు అలాట్ మెంట్ కూడా ఇచ్చాం. నిర్మాణాలు కూడా ప్రారంభిస్తున్నాం. గోశామహల్, చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో తొందరలోనే భూమి పూజ చేసి టవర్స్ నిర్మాణం చేస్తాం'' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

#Indiramma Illu#Indiramma Towers#Ponnam Prabhakar#Telangana#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి