ఏపీ

Ap : కాకినాడకు సాధిక్.. ఏఈ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ఏపీలో సాధిక్ అనే కోచ్ కారణంగా కాకినాడ ఏఈ నూకరాజు ఫ్యామిలీ సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. నూకరాజు, అతని భార్య, కోడలు, మనవడు గోదావరిలో దూకగా.. కేవలం మనవడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వారంతా మరణించిన విషయం తెలిసిందే.

ఏపీలో సాధిక్ అనే కోచ్ కారణంగా కాకినాడ ఏఈ నూకరాజు ఫ్యామిలీ సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. నూకరాజు, అతని భార్య, కోడలు, మనవడు గోదావరిలో దూకగా.. కేవలం మనవడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వారంతా మరణించిన విషయం తెలిసిందే. వీరి మరణానికి కోచ్ సాధిక్ కారణమని..అతను తన కుటుంబాన్ని వేధించాడని,తన కొడుకు భాస్కర్ రెడ్డి మరణానికి కారకుడు అని.. తన కోడలిని వేధింపులకు గురిచేయడంతో పాటు అశ్లీల వీడియోలు,ఫొటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశాడని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. చనిపోవడానికి ముందు ఆయన కోడలు రాసిన సూసైడ్ నోట్ కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.

సాధిక్ తన భర్తకు ఇంజెక్షన్ ఇచ్చి చనిపోయేలా చేశారని, ఆ తర్వాత తను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించింది. ఇదిలాఉండగా, నలుగురి మరణానికి కారణమైన సాధిక్.. మొన్నటివరకు అజ్ఞాతంలోకి వెళ్లగా.. నిందితుడు సాధిక్ ఖాన్‌ను ఢిల్లీలో కాకినాడ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

ఢిల్లీ నుంచి రైలులో సాధిక్ ఖాన్‌ను కాకినాడకు తరలించగా.. రైలు సామర్లకోటలో కాకుండా జి.మేడపాడు వద్ద ఆగడంతో అక్కడే సాధిక్‌ను పోలీసులు దింపేసి జి.మేడపాడు నుంచి వాహనంలో కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.సాధిక్ ఖాన్‌ను తీసుకొచ్చే క్రమంలో పోలీసులు అత్యంత గోప్యత పాటించినట్లు సమాచారం.ప్రస్తుతం సాధిక్ ఖాన్‌ను అడిషనల్ ఎస్పీ కిషోర్ ఆధ్వర్యంలో విచారిస్తున్నట్టు తెలిసింది. విచారణలో ఆరుగురు సీఐలు పాల్గొంటున్నట్లు సమాచారం.విచారణ అనంతరం సాధిక్ ఖాన్‌ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మరల కస్టడీకి కోరనున్నట్టు తెలుస్తోంది.

https://x.com/pulsenewsbreak/status/2091722347120373966?s=20

ఇదిలాఉండగా, ఈ ఘటన ముమ్మాటికీ లవ్ జిహాద్‌ అని.. ప్రభుత్వం దీనిని తొక్కిపెట్టాలని చూస్తుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన బాధిత కుటుంబంలో ప్రాణాలతో క్షేమంగా బయటపడిన ఏఈ నూకరాజు మనవడిని కలిసి పరామర్శించినట్టు తెలిసింది.

#sports coach sadik#suicides#kakinada#AE nookaraju#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి