తెలంగాణ జానపద నటులు ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ ఒకే గదిలో అర్ధనగ్నం దొరకడంతో దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.‘బాసింగ బలాలు’ సాంగ్‌తో వీరిద్దరికి మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా, వీరిద్దరి కాంబోలో చాలానే ఫోక్స్ వచ్చాయి. వాస్తవానికి వీరు ఒకే గదిలో దొరికిన కొన్ని గంటల్లో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్స్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చాయి.ఈ జంట ఎవరా? అని తెలుసుకోవడానికి వీరు నటించిన సాంగ్స్ కోసం నెటిజన్స్ ప్రయత్నించినట్టు తెలిసింది.
ఈ నెల 19న ఈ ఘటన వెలుగుచూడగా.. సోషల్ మీడియా మొత్తం వీరి వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా,ఈ వ్యవహారంపై మాధురి రాథోడ్ ప్రస్తుతం మౌనంగా ఉండిపోగా.. ఈశ్వర్ సాయి మాత్రం తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ‘బాత్రూమ్ వాడుకోడానికే మాత్రం నేను మాధురి గదికి వెళ్లా.. నేను, మాధురి కేవలం ఎమోషనల్‌గానే కనెక్ట్ అయ్యాం.నా భార్యను కొందరు తప్పు దారి పట్టించారు. ఆ ఆవేశంలోనే ఆమె దాడి చేసింది. ఆ క్షణంలో ఏమీ మాట్లాడొద్దని మౌనంగా ఉన్నా. అమ్మా మాధురి! ఈ విషయంలో నీకు క్షమాపణ చెబుతున్నా.. మీడియా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి’ అంటూ వేడుకున్నారు.
కాగా, నిన్న ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. ఒత్తిడి కారణాల దృష్ట్యా హోటల్‌లో అలా చేయాల్సి వచ్చిందని, భార్య ఉండగా తాను అలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని అంగీకరించాడు. ఇదిలాఉండగా, తన మీద అకారణంగా దాడి చేశారని, పరువు తీశారని మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్యకరంగా దూషించడంతో పాటు దాడి చేసిందని, తన ఫోన్ దొంగిలించి అందులోని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిందని మాధురి నిన్న వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన వ్యక్తిగత జీవితానికి, పరువుకు భంగం కలిగించేలా వ్యవహారించిన వారిపై,సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను కోరింది. ఈనెల 19న వేములవాడలోని ఓ రూంలో ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఏకాంతంగా ఉన్న సమయంలో సాయి భార్య రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకుని నానా రభస చేసి విషయం తెలిసిందే.మాధురిపై ఈశ్వర్ సాయి భార్య దాడి చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


