రాష్ట్రంలోని ఓటర్లకు నోటీసులు పంపించే ప్రక్రియను ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) లో భాగంగా ఎవరైతే ఎన్యూమరేషన్ ఫారమ్స్ బీఎల్‌వోల నుంచి అందుకోలేదో, అందుకున్న వారు ఎవరైతే తిరిగి అప్పగించలేదో అనగా వివరాలు అందజేయని వారికి తాజాగా ఈసీ నోటీసులు జారీ చేయనుంది. వారంతా ఆ నోటీసుల్లో ఉన్న అంశాల మేరకు వారు భారతీయులు అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకోసం ఆ నోటీసుల్లో పేర్కొన్న విధంగా ధ్రువపత్రాలు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణలో నేటి నుంచి ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, ఈ నెల 17వ తేదీన ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్టు ఈసీ తెలిపింది.
https://x.com/pulsenewsbreak/status/2091727124130570245?s=20
అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోలు నోటీసులు అందించనున్నారు.నోటీసులకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం తెలిపింది. వివరణ ఇవ్వకపోతే ఓటు తొలగించే అవకాశం ఉందని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నోటీసుల జారీ కోసం ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసినట్టు ఈసీ తెలిపింది. ఓటరుకు నోటీసు ఇచ్చిన ఫొటోను బీఎల్‌వోలు యాప్‌లోనూ అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది.ఒక్కో పోలింగ్ కేంద్రంలో రోజుకు 200 మంది ఓటర్లు వివరణ ఇచ్చే విధంగా బీఎల్‌వోలు నోటీసులు ఇవ్వనున్నారు.
ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో 11 రకాల కార్డుల్లో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని ఈసీ స్పష్టం చేసింది.ఇంటిపేరు, పేర్లలో తప్పులున్న ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ఎన్నికలసంఘం గుర్తించగా.. ఈ సమస్య ఓల్డ్ సిటీలో అధికంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువ మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్‌మ్యాపింగ్ ఓట్లు అధికంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు.












