NBK 112: కొరటాల శివ, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలయ్య మార్క్ పవర్ ఫుల్ స్టోరీని దర్శకుడు కొరటాల శివ సిద్ధం చేశాడు. ఆచార్య డిజాస్టర్..దేవర ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా కూడా కొరటాల చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే, గతనెల కాకినాడలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలయ్యకి గాయం అయింది. ఈ కారణంగా దాదాపు 2 నెలలపాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో, అటు గోపీచంద్ మలినేని సినిమా కూడా ముందు అనుకున్న తేదీకి రిలీజ్ కాదని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేసేందుకు పక్కా ప్రణాళికతో గోపీచంద్ ఉరుకులు పరుగులు మీద సినిమాను రెడీ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే, కొరటాల చెప్పిన కథ తెరకెక్కాలంటే 200 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుందని, ఇదే బడ్జెట్ గనక తప్పదు అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామని బాలయ్య చెప్పినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. సినిమా మొత్తం 120 కోట్లకి మించకుండా చూసుకోగలిగితే చేద్దాం..లేదంటే పక్కన పెట్టేద్దాం.. అని కూడా కొరటాలతో బాలయ్య అన్నాడని వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ కేవలం రూమర్స్ అని తెలుస్తోంది.
ఎన్‌బికే 112 ఈ ఆగస్టు నుంచే షూటింగ్ ప్రారంభం కాబోతుందని తాజా సమాచారం. బాలయ్య డేట్స్ ఇవ్వడంతో ఆగస్టు చివరి వారంనుంచి, ఆయన లేని సన్నివేశాలను ఇతర తారాగణంపై ప్లాన్ చేస్తున్నాడట. సెప్టెంబర్ చివరి వారం నుంచి బాలయ్య సెట్స్‌లో జాయిన్ అవుతాడట. సో మొత్తానికి అసలు ప్రాజెక్టే క్యాన్సిల్ అయిందనని వస్తున్న వార్తలకి అధికారికంగా ఈ నెలలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్. కొరటాల సినిమా అంటే పవర్ ఫుల్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఇక, బాలయ్య అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కాంబోలో వచ్చే సినిమా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.


