తెలంగాణ

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు, రేపు అతిభారీ వర్షాలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ, తాజాగా ఏర్పడిన వాతావరణ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో వానలు మళ్లీ జోరుందుకున్నాయి. రెండు రోజుల పాటు (ఆగస్టు 24, 25 తేదీల్లో) రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ, తాజాగా ఏర్పడిన వాతావరణ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో వానలు మళ్లీ జోరుందుకున్నాయి. రెండు రోజుల పాటు (ఆగస్టు 24, 25 తేదీల్లో) రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

రాజధాని హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన ఈదురుగాలుల జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

వ్యాపించిన వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు, వంకల సమీపంలో నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

#Konda Surekha Controversy#Meenakshi Natarajan Telangana Congress#Mahesh Kumar Goud Warning#Congress MLAs Demand Action On Konda Surekha#Revanth Reddy Congress Crisis News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి